
ఢిల్లీకి దీదీ: మోదీకి షాకిచ్చే ప్లాన్‌తో -సోనియా గాంధీ, ఇతర విపక్ష నేతల్ని కలవనున్న బెంగాల్ సీఎం మమత
దేశంలోనే అత్యంత బలమైన మోదీ-షా ద్వయాన్ని పశ్చిమ బెంగాల్ లో ఓడించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ వారికి షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ప్రతిపాదిత ఉమ్మడి అభ్యర్థి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గెలుపు, మోదీ సర్కారుపై ప్రతిపక్షాల సంయుక్త పోరును నిర్ణయించేలా దీదీ ఢిల్లీ టూర్ సాగనుంది..
ఎంపీ రఘురామకు భారీ షాక్: వైసీపీ అనర్హత ఫిర్యాదుపై లోక్‌సభ సెక్రటేరియట్ నోటీసులు -15 రోజుల్లోగా
కేంద్రంలోని మోదీ సర్కారును ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని భావిస్తోన్న తరుణంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచింది. తాను ఢిల్లీకి వెళుతున్నట్లు మమత స్వయంగా ప్రకటించారు. బుధవారం కోల్ కతాలో మీడియాతో మాట్లాడిన ఆమె.. తన ఢిల్లీ టూర్ పై ఇలా చెప్పుకొచ్చారు...

''సాధారణంగా నేను పార్లమెంటు సమావేశాల సమయంలో ఢిల్లీ వెళ్లి నేతలను కలుస్తుంటా. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లలేకపోయాను. ప్రస్తుతం కొవిడ్ పరిస్థితి కొంత మెరుగుపడింది. త్వరలోనే ఢిల్లీ వెళ్లి కొందరు నేతలను కలుస్తా. అలాగే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమయాన్ని కూడా కోరా'' అని మమత చెప్పారు.
తన భారతీయ జనతాపార్టీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్న వేళ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి 'కొందరు నేతలను'ను కలవనున్నట్టు చెప్పారు. అయితే, ఆ నేతలు ఎవరన్న విషయాన్ని ఆమె వెల్లడించలేదు. అలాగే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ కూడా కోరినట్టు తెలిపారు.
సీజేఐ వ్యాఖ్యల ఊతం, రెచ్చిపోయిన రఘురామ -సీఎం జగన్, సాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు -మహిళలతో అదోలా
మమతాబెనర్జీ జూలై 25న ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వార్షాకాల పార్లమెంట్ సమావేశాలు జూలై 19 నుంచి ఆగస్టు13 వరకు జరుగుతాయి. తన పర్యటనలో మమత.. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని కలుస్తారిని, అలాగే ఇతర విపక్ష పార్టీల నేతలతోనూ ఆమె భేటీ అవుతారని తెలుస్తోంది. ఇటీవల బీజేపీ వ్యకతిరేక కూటమికి చెందిన పలు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ఎన్సీపీ నేత శరద్ పవర్ నివాసంలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. శరద్ పవార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలలో వరుసగా భేటీ అవుతున్న నేపథ్యంలో మమత పర్యటనపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.