ముఖ్యమంత్రి అల్లుడికి చెంపదెబ్బ, సోనియా అల్లుడి భూములపై వేటు!

కోల్‌కతా/జైపూర్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు అభిషేక్ బెనర్జీ పైన ఓ యువకుడు దాడి చేసి చెంపదెబ్బ కొట్టాడు. తూర్పు మిడ్నాపూర్ జిల్లా చండీపూర్ పార్టీ సభలో అభిషేక్ ప్రసంగిస్తుండగా ఈ సంఘటన జరిగింది.

ఈ ఘటనతో అనంతరం చెంప దెబ్బ కొట్టిన యువకుడి పైన టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు. అతనిని తీవ్రంగా కొట్టారు. పోలీసులు యువకుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, దాడి చేసిన యువకుడు ఎవరు, ఎందుకు ఇలా చేశాడనే విషయమై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

 Mamata Banerjee's nephew slapped by youth at a rally

రాబర్ట్ వాద్రా భూములపై రాజస్థాన్ వేటు!

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కంపెనీకి చెందినవిగా భావిస్తున్న చెపర్తన్న బికనీర్‌లోని కొలయట్ ప్రాంతంలోని 374.44 హెక్టార్లకు సంబంధించిన యాజమాన్య హక్కుల మార్పిడులను రాజస్థాన్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రైవేటు వ్యక్తుల పేరుతో జరిగిన అక్రమ యాజమాన్య హక్కుల బదిలీలుగా గుర్తించిన రాజస్థాన్ ప్రభుత్వం ఈ 18 ఒప్పందాలను రద్దు చేసిందని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రాన్ సింగ్ ఆదివారం ఫోన్‌లో పిటిఐకి చెప్పారు.

డిసెంబర్ 31న కొలయట్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కోర్టులో కొలయట్ తహసీల్దార్ పలు ఫిర్యాదులు దాఖలు చేసారని, ఇవన్నీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా కేటాయించిన భూములని గుర్తించిన కోర్టు వాటి యాజమాన్య హక్కుల బదిలీని రద్దు చేసిందని సింగ్ చెప్పారు.

ఎస్‌డిఎం రద్దు చేసిన భూమి రాబర్ట్ వాద్రా కంపెనీకి చెందినదా అని ప్రశ్నించగా, దానిపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరిస్తూ, దీనిగురించి తమకు తెలియదని, ఎందుకంటే తహసీల్దార్ ఎస్‌డిఎం కోర్టు ముందుంచిన ఫిర్యాదుల్లో ఏ కంపెనీ, వ్యక్తి పేరు పేర్కొనలేదన్నారు. కాగా, తహసీల్దార్ గజేంద్ర సింగ్ కూడా దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+