వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేనల్లుడిని సీఎం చేయడమే లక్ష్యం.. దీదీపై అమిత్ షా ఫైర్

|
Google Oneindia TeluguNews

బెంగాల్ ఎన్నికలు కాక రేపుతున్నాయి. రెండు విడతలు జరగగా మరో 6 విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే సీఎం మమతా బెనర్జీపై అమిత్ షా ఫైరయ్యారు. బెంగాల్ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. రెండుసార్లు సీఎంగా మమత చేసిన సంక్షేమం పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు ఆమెను ఇంటికి పంపించాలని భావిస్తున్నారని చెప్పారు. బెంగాల్‌లో ఇక మమత శకం ముగిసినట్టేనని చెప్పారు.

 Mamata Banerjee spent her 2nd term trying to make her nephew CM: Amit Shah

ఈ సారి మమత పాలనను పట్టించుకోలేదని అమిత్ షా అన్నారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తదుపరి సీఎం చేయడంపైనే ఫోకస్ చేశారని ఆరోపించారు. దీనిని ప్రజలు గమనించారని.. ఆమెకు బుద్ది చెప్పాలని భావించారని తెలిపారు. అందుకోసమే ఈ సారి భాదానిపూర్ నుంచి కాకుండా నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగారని చెప్పారు. సిట్టింగ్ స్థానం నుంచి పారిపోయి.. మరో చోట పోటీకి దిగారని వివరించారు.

మమతా ఎక్కడనుంచి పోటీచేసినా పర్లేదు అని అమిత్ షా చెప్పారు. కానీ ఆమె ఓడిపోవడం మాత్రం ఖాయం అని చెప్పారు. నందిగ్రామ్‌లో బీజేపీ గెలుస్తోందని.. మమతాపై సువేందు 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెప్పారు. రెండు విడతల్లో కలిసి బీజేపీ 50 నుంచి 60 సీట్లు గెలుస్తోందని చెప్పారు.

English summary
people of West Bengal are so "unhappy" with Chief Minister Mamata Banerjee's two terms that they have now decided to bid her farewell, claimed Union home minister Amit Shah on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X