దీదీ వర్సెస్ మోదీ : ’ఫణి‘ సమీక్షకు మమత నో, గవర్నర్‌తో మాట్లాడటంపై గుస్సా

న్యూఢిల్లీ : ఎన్నికల వేళ ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం దీదీ మధ్య అధిపత్య పోరు పీక్ స్టేజీకి చేరింది. ఫణి తుఫాను సృష్టించిన బీభత్సంతో నష్టం అంచనా వేసేందుకు పీఎంవో సమాచారం అందిస్తే .. ఎన్నికల విధుల్లో తాము బిజీగా ఉన్నామని బెంగాల్ అధికారులు తెలుపడం ఇందుకు కేంద్ర, రాష్ట్రాల మధ్య విభేదాలకు అద్దం పడుతోంది.

మేం బిజీ ...?

మేం బిజీ ...?

ఫణి తుఫాను సృష్టించిన బీభత్సంపై సోమవారం ఒడిశాలో నష్టం అంచనా వేశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో కలిసి ప్రధాని మోదీ రివ్యూ చేశారు. అయితే ఇవాళే బెంగాల్‌లో కూడా రివ్యూ చేస్తామని బెంగాల్ ప్రభుత్వానికి ప్రధానమంత్రి కార్యాలయం సమాచారం పంపించింది. అయితే బెంగాల్ అధికారులు మాత్రం తాము ఎన్నికల విధుల్లో తీరికలేకుండా ఉన్నామని .. నష్టపరిహారం అంచనా వేయడం కుదరదని తేల్చిచెప్పారు.

గవర్నర్‌తో ఎలా మాట్లాడతారు ?

గవర్నర్‌తో ఎలా మాట్లాడతారు ?

ఫణి తుఫాను నష్ట పరిహారం అంచనా అంతకుముందే బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం జరిగింది. తుఫాను సహాయ, పునరావాస చర్యలపై మోదీ .. మమతా బెనర్జీతో చర్చించలేదని ఆరోపించింది. తుఫాను సమయంలో ప్రధాని కేవలం బెంగాల్ గవర్నర్ కేశార్ నాథ్ త్రిఫాఠితో మాత్రమే మాట్లాడారని మండిపడ్డారు. అయితే శనివారం పీఎంవో నుంచి మమతాకు ఫోన్ చేశామని .. ఆమె స్పందించలేదని ఉన్నతాధికారులు చెప్తున్నారు. రెండుసార్లు ప్రయత్నించినా మమతా అందుబాటులోకి రాలేదని తెలిపారు.

బీజేపీ కార్యకర్తనా ?

బీజేపీ కార్యకర్తనా ?

తుఫాను సమయంలో గవర్నర్‌తో ప్రధాని మాట్లాడటాన్ని టీఎంసీ నేతలు తప్పుపడుతున్నారు. ఇది ఫెడరల్ స్పూర్తికి విఘాతమని టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ ఆరోపించారు. ప్రధాని మోదీ గవర్నర్‌తో మాట్లాడటం ఏంటీ ? ఆయన ఏమైనా బీజేపీ కార్యకర్తనా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన సీఎంను కాదని .. గవర్నర్‌తో చర్చలు జరుపడం మంచిది కాదని సూచించారు. ఇది దురదృష్టకరమని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+