ఫేస్‌బుక్, ట్విట్టర్ ప్రొఫైల్ పిక్స్ ఛేంజ్.. టీఎంసీ నేతల వింత నిరసన

కోల్‌కతా : టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ సహా ఆ పార్టీ లీడర్లంతా వినూత్న నిరసన పాటిస్తున్నారు. తమ సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించి ట్విట్టర్, ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్స్ మార్చారు. ఇదివరకు ఉన్న ఇతరత్రా ఫోటోలను తీసేసి.. వాటి స్థానంలో సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఇమేజ్‌ను పెట్టుకున్నారు.

మంగళవారం (14.05.2019) నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన ప్రచార ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆ సందర్భంలో చెలరేగిన ఘర్షణలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసమైంది. అయితే ఆయన బెంగాల్ పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కావడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సీరియస్‌గా తీసుకుంది.

Mamata TMC Leaders Change Twitter And FB Pictures To Vidyasagar After Statue

అమిత్‌షా రోడ్‌ షో కార్యక్రమాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఎం కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపుతప్పింది. అయితే ఆ ఘటనతో బీజేపీ కార్యకర్తలు కూడా రెచ్చిపోయారు. పలు వాహనాలకు నిప్పు పెట్టడమే గాకుండా.. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బీజేపీ శ్రేణుల తీరును నిరసిస్తూ.. టీఎంసీ అగ్రనేతలంతా తమ సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన ప్రొఫైల్ ఫోటోలు మార్చేసి.. వాటి స్థానంలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఇమేజ్ పెట్టుకోవడం చర్చానీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+