దారుణం: బెదిరింపులకు గురిచేసి 3నెలలుగా కూతురుపై తండ్రి రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రే(35) కూతురు(11)పై బెదిరింపులకు గురి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తల్లికి చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బాధితురాలిని బెదిరించాడు. దీంతో ఆమె విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని మాల్వీయనగర్‌లో చోటు చేసుకుంది.
కాగా, చివరకు తండ్రి లైంగిక వేధింపులు తట్టుకోలేక బుధవారం బాధితురాలు తన తల్లికి తండ్రి అఘాయిత్యాన్ని గురించి చెప్పింది. దీంతో తల్లి నేరుగా స్పందించకుండా పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇది ఇలా ఉండగా మరో ఘటనలో నాలుగేళ్ల బాలికపై పక్కింటి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్ కొనేందుకు బయటికి వచ్చిన చిన్నారిపై 16ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడుతుండగా ఆమె బంధువులు నిందితుడ్ని పట్టుకున్నారు. అతడ్ని చితకబాది పోలీసులకు అప్పగించిన బంధువులు, చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications