వామ్మో.. కారులోకి రావాలని యువతికి బలవంతం, నిరాకరించడంతో విచక్షణరహితంగా కాల్పులు
దేశంలో క్రైం రేట్ పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, యూపీలో ఎక్కువగా ఉంటుంది. యువత గన్లతో రెచ్చిపోతున్నారు. ఎప్పుడు.. ఎక్కడో ఓ చోట ఘర్షణ జరుగుతూనే ఉంది. తాజాగా ఓ యువతిపై కాల్పులు జరపడంతో.. అక్కడికక్కడే ఆమె కుప్పకూలిపోయింది.
హర్యానా ఫరీదాబాద్ బల్లబ్‌ఘడ్‌లో ఘటన జరిగింది. ఓ యువతి సోమవారం పరీక్ష రాసి.. కాలేజీ నుంచి బయటకు వచ్చింది. అయితే అప్పటికే ఆమె కోసం కాచుకొని ఓ యువకుడు ఉన్నాడు. కారు వద్ద వెయిట్ చేసి.. రాగానే లోపలికి రావాలని కోరాడు. అయితే వారిద్దరూ ఒకరికొకరు తెలుసు.. కానీ ఆమె అతనితో వెళ్లేందుకు ఇష్టపడలేదు. రానని తెగేసి చెప్పింది.

తాను కారులో రాను అని చెప్పింది. చేతి పట్టకోగా.. తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో అతను కోపోద్రిక్తుడై పోయాడు. అప్పటికే తనతో తీసుకొచ్చిన గన్‌తో కాల్పులు జరిపాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. కాల్పులతో అక్కడ కలకలం రేగింది. అక్కడున్న వారు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. తీవ్రగాయాలతో చనిపోయింది.
Recommended Video
వెంటనే కాల్పుల జరిపిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మంగళవారం అతనిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతని స్వస్ధలం మేవాత్ అని పోలీసుల తెలిపారు. వారిద్దరూ ఒకరికొకరు తెలుసు అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాల్పులు జరపడానికి గల కారణంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని పేర్కొన్నది.












Click it and Unblock the Notifications