30పేజీల నోట్: పార్లమెంట్ ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్య
న్యూఢిల్లీ: డిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పార్లమెంట్‌లోని పార్కింగ్ కాంప్లెక్స్‌లో చెట్టుకు ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
రైల్‌భవన్, విజయ్‌చౌక్ మధ్యలోని మీడియా పార్కింగ్ వద్ద వ్యక్తి చెట్టుకు వేలాడుతూ కన్పించడంతో పార్లమెంట్ సిబ్బంది పోలీసులకు సమాచారమందించారు.

మృతి చెందిన వ్యక్తి మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన రామ్ దయాల్ వర్మ(39)గా పోలీసులు గుర్తించారు. కాగా, మృతుడి వద్ద 30పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్పుల కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
మృతుడి బంధువులకు సమాచారమందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రపతి భవనానికి సమీపంలో ఉన్న ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని, విచారణ చేపడతామన్నారు.












Click it and Unblock the Notifications