వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతి కిడ్నాప్, తరచూ రేప్: నిందితుడికి పదేళ్ళ జైలు

|
Google Oneindia TeluguNews

Man gets 10-year jail for kidnap, rape
న్యూఢిల్లీ: ఓ యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందిత యువకుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని ట్రయల్ కోర్టు తీర్పును వెలువరించింది. అంతేగాక అతనికి రూ. 32 వేల జరిమానా విధించింది. నిందితుడు నేరానికి పాల్పడినట్లు సరైన ఆధారాలు ఉన్నందు వల్ల కోర్టీ ఈ శిక్షను విధించినట్లు పేర్కొంది

పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన రాజేష్(26) అనే నిందితుడు 2010, మే‌లో బాధిత యువతిని కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పాలెంలోని తన సోదరి ఇంట్లో బాధిత యువతిని నిర్బంధించాడు. ఆమెపై తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా, రాజేష్ సోదరి, బావలు ఆ యువతికి మత్తు పదార్థం ఇచ్చి వ్యభిచార కూపంలోకి నెట్టేందుకు ప్రయత్నించారు.

అనంతరం ఓ అద్దె గదిలోకి యువతిని బంధించిన రాజేష్, అక్కడ కూడా ఆమెపై తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా, ఎలాగోలా బయటపడ్డ బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. విచారణ జరిపిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి, ఐపిసి సెక్షన్స్ 376, 363, 120 బి కింద కేసులు నమోదు చేశారు. తాను ఆమెపై అత్యాచారానికి పాల్పడలేదని, తమ మధ్య సంబంధం ఉందని తెలిపాడు.

తనను అనవసరంగా కేసులో ఇరికించారని ఆరోపించాడు. అయితే కేసుకు సంబంధించిన ఇతర ఆధారాలు, బాధితురాలి వాదన విన్న కోర్టు రాజేష్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. తనను బలవంతంగా కిడ్నాప్ చేసి, తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత యువతి కోర్టుకు, పోలీసులకు తెలిపింది.

English summary
A trial court has sentenced a 26-year-old man to 10 years' rigorous imprisonment for kidnapping and raping a teenage girl in 2010.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X