అక్రమ సంబంధం పెట్టుకుని భర్తనే కడతేర్చిన కసాయి భార్య..ఎలా చంపిందో తెలుసా..?
కర్నాటక: ఇప్పటి వరకు వివాహేతర సంబంధాలు పెట్టుకుని భార్యలను హతమార్చే భర్తలనే చూశాం. ఇప్పుడు భార్యలు కూడా అక్రమసంబంధాలు పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తలను కడతేరుస్తున్నారు. తాజాగా కర్నాటకలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.
కర్నాటక రాష్ట్రం కృష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి తాలూకా జంబుకూడబట్టి గ్రామంలో రాజలింగం సోనియా దంపతులు జీవిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. భర్త రాజలింగం రోజువారీ కూలీ పనికి వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది సోనియా. ఈ విషయం తెలుసుకున్న రాజలింగం పలుమార్లు వారించాడు. అయినప్పటికీ సోనియా భర్త మాట వినలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఇక రాజలింగం బతికి ఉంటే తమ వివాహేతర బంధానికి అడ్డుగా నిలుస్తాడని భావించిన సోనియా ప్రియుడితో కలిసి రాజలింగాన్ని హతమార్చేందుకు ప్లాన్ చేసింది.

శనివారం రాత్రి రాజలింగం కూలిపనికి వెళ్లి ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంట్లో మాటు వేసి ఉన్న సోనియా ప్రియుడు తన మిత్రులతో కలిసి రాజలింగం నోట్లో బట్టలు కుక్కి విషపు ఇంజెక్షన్ ఇచ్చేశాడు. గిలగిల కొట్టుకున్న రాజలింగం కాసేపటికి మృతి చెందాడు . ఇక మృతదేహాన్ని ఉరి తీసి అసలు నాటకం మొదలు పెట్టింది సోనియా. బయటకు వెళ్లి గట్టిగా కేకలు వేసింది. తన భర్త రాజలింగం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని నాటకం మొదలు పెట్టింది. ఇరుగు పొరుగువారు వచ్చి గుమికూడారు. వారిని నమ్మించే ప్రయత్నం చేసింది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి రాజలింగం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం నివేదికలో విషం ఇచ్చారన్న సంగతి బయటకు రావడంతో పోలీసులకు సోనియాపై అనుమానం వచ్చింది. రాజలింగం పిల్లలను పోలీసులు విచారణ చేయగా... పిల్లలు ఎపిసోడ్‌ను మొత్తం పూసగుచ్చినట్లు చెప్పారు. దీంతో పోలీసులు సోనియాను అరెస్టు చేశారు. ఆమె సెల్‌ఫోన్ నుంచి ఆమె ప్రియుడికి ఫోన్ చేయించగా అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు పలు ప్రాంతాల్లో నిందితుల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications