నమ్మిన పాపానికి.. పెళ్లి పేరెత్తితే నగ్న ఫోటోలతో బ్లాక్ మెయిల్.. ఎంతోమంది మహిళలను..
అతని పేరు జో అబ్రహం మాథ్యూస్. చదివింది పీయూసీ వరకే. కానీ మోసాలు చేయడంలో పీహెచ్‌డీ చేశాడు. అమాయక మహిళలే టార్గెట్‌గా వారి నుంచి డబ్బులు గుంజుతుంటాడు. పెళ్లి పేరుతో వారిని శారీరకంగానూ లోబర్చుకుంటాడు. ఇటీవల ఓ ఉపాధ్యాయురాలిని ఇలాగే మోసం చేసిన మాథ్యూస్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విచారణలో అతని గురించి పలు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. గతంలోనూ ఓ టీచర్‌ను ఇలాగే మోసం చేశాడని పోలీసులు గుర్తించారు.

ఇలా టీచర్‌కు వల వేశాడు..
కేరళకు చెందిన జో అబ్రహం మాథ్యూస్(35)కు గతంలోనే పెళ్లయింది. ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. అయితే మ్యాట్రిమోనియల్ సైట్‌లో తన ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేసి పలువురు మహిళలను మోసం చేశాడు. బెంగళూరుకు చెందిన ఓ 39 ఏళ్ల ఉపాధ్యాయురాలి ప్రొఫైల్ చూసి ఆమెకు వల వేశాడు. తన పేరు తళత్ ప్రసాద్ అని లండన్‌లోని బ్రిటీష్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్నానని చెప్పుకున్నాడు. ఆమె కూడా అతన్ని నమ్మింది. ఇద్దరూ కలిసి దేశంలోని పలు ప్రాంతాల్లో విహార యాత్రలకు వెళ్లారు. ఆ సమయంలో శారీరకంగా దగ్గరయ్యారు.

క్రమంగా రూ.45లక్షలు కాజేశాడు..
ఆమెతో బాగా చనువు పెరిగాక.. తన ఆర్థిక సమస్యల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య అని చెప్పి డబ్బు తీసుకునేవాడు. అలా ఆమె వద్ద నుంచి రూ.45లక్షలు కాజేశాడు. ఇదే క్రమంలో ఆమె పెళ్లి గురించి ఒత్తిడి తీసుకురాగా.. తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. అదే సమయంలో 2016లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి అతను జైలుకు వెళ్లి వచ్చినట్టు తెలిసింది. దీనిపై ఆమె అతన్ని నిలదీయగా.. అలాంటిదేమీ లేదని బుకాయించాడు.

ఇలా బయటపడ్డాడు..
తనను పెళ్లి చేసుకోవాలని.. లేనిపక్షంలో తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయాలని ఆ మహిళ మాథ్యూస్‌పై ఒత్తిడి పెంచింది. దీంతో తన అసలు రంగు బయటపెట్టాడు. పెళ్లి చేసుకోనని... ఎక్కువ ఒత్తిడి చేస్తే నగ్న ఫోటోలు బయటపెడుతానని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఓరోజు కోరమంగళలోని అతని ఇంటికి వెళ్లగా.. అతని ఫ్లాట్‌లో మరో అమ్మాయి కనిపించింది. ఆమె తన సోదరి అని అతను నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ తర్వాత విచారణలో ఆమె అతని మోసాల్లో భాగస్వామి అని తేలింది.
Recommended Video

కూపీ లాగుతున్న పోలీసులు
మాథ్యూస్ పెద్ద మోసగాడని గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారించగా పలు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. బెంగళూరులోనే గతంలో ఓ టీచర్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సహజీవనం చేసి రూ.38లక్షలు కాజేసినట్టు గుర్తించారు.అలాగే కెనడాలో నివాసం ఉండే మరో మహిళను సైతం అతను ఇలాగే మోసం చేసినట్టు గుర్తించారు. ఇతని ఉచ్చులో ఇంకెంత మంది చిక్కుకుని ఉంటారన్న దానిపైపోలీసులు కూపీ లాగుతున్నారు.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..??












Click it and Unblock the Notifications