దారుణం: కూతురు, అత్త, మరదలుపై రేప్ చేశాడు

పనాజి: ఓ వ్యక్తి వావివరసలు మరచి కామాంధుడై తన అత్త, మరదలు, తన మైనర్ కూతురుపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని సుమారు ఆరునెలలపాటు కొనసాగించాడు. ఈ ఘటన గోవా రాష్ట్రంలో చోటు చేసుకుంది. వేధింపులు తాళలేని కుటుంబసభ్యులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నిందితుడు(30) గోవాకు చెందిన గోవాకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అతడు ఏ పని చేయకుండా భార్య సంపాదనపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఏడాది క్రితం నిందితుడు తన భార్య, కూతురు, కొడుకుతో కలిసి ఉత్తరగోవాలోని మరదలి ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లో మరదలుతోపాటు ఆమె కూతురు, ఆమె తల్లి ఉంటున్నారు. మరదలు తల్లి పూలు అమ్మి కుటుంబాన్ని పోషిస్తోంది.

Man held for raping daughter, 2 relatives

కాగా, పూలు అమ్ముతున్న మరదలు తల్లిని ఇంటికి తీసుకెళ్తానని బైకుపై ఎక్కించుకున్న నిందితుడు, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకువచ్చి.. రాత్రి కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక ఆమెను ప్రతీరోజు తనకు కోరిక తీర్చాలని అడిగాడు. తన కూతురు వివాహం విషయం దృష్టిలో ఉంచుకుని ఈ విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పలేదని పోలీసులు చెప్పారు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మరదలిపై కూడా నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పినా ఆమె స్పందించలేదు. అంతటితో ఆగకుండా తన సొంత కూతురుపై కూడా నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడి వేధింపుల భరించలేని ఆ కుటుంబ సభ్యులు పనాజీ పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+