ప్రియురాలి భర్తను చంపేందుకు రూ. 15 లక్షల సుపారీ, కాల్పులు: చివరకు కటకటాలపాలు
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని కర్ణి విహార్ ప్రాంతంలో 41 ఏళ్ల వ్యక్తి(కారు వాషర్)పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత వారం రోజులకు ఈ హత్యాయత్నం కేసులో నిందితుడైన 37 ఏళ్ల వ్యక్తిని మహారాష్ట్రలోని డోంబివిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తన ప్రియురాలి భర్త అయిన బాధితుడిని చంపేందుకు కమల్ షిండే అనే వ్యక్తి.. గన్‌మెన్లకు రూ. 15 లక్షలు సుపారి ఇచ్చినట్లు తేలింది.

జైన్ భార్యపై కన్నేసిన షిండే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని డోంబివిల్లీలో కార్ వాషర్ ఆదిత్య జైన్, అతని భార్య నీలం(పేరు మార్చబడినది) నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కమల్ షిండేతో నీలంకు పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ తరచూ కలుస్తుండేవారు. ఈ విషయం తెలిసిన ఆదిత్య జైన్ తన కాపురాన్ని రాజస్థాన్ లోని జైపూర్ మార్చాలని నిర్ణయించాడు. గత సంవత్సరమేవారు జైపూర్‌కు మకాం మార్చారు.

జైపూర్ మకాం మార్చినా.. రూ. 15 లక్షల సుపారీ ఇచ్చి..
నీలం జైపూర్ వెళ్లిందనే విషయం తెలుసుకున్న షిండే.. ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ద్వారా ఆమె జైపూర్ చిరునామాను కనుగొన్నాడు. ఈ నేపథ్యంలోనే నీలంతో వివాహేతర సంబంధం కొనసాగించేందుకు అడ్డుగా ఉన్న జైన్‌ను చంపేందుకు రూ. 15 లక్షలు సుపారీగా ఇచ్చి హంతకులను పురమాయించాడు షిండే. మొదట రూ. 13 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. హత్య చేసిన తర్వాత మొత్తం చెల్లిస్తానని చెప్పాడు.

ప్రియురాలి భర్తపై కాల్పులు..
జూన్ 16న జైన్ తన షాపులో కారు శుభ్రం చేస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై తుపాకులతో వచ్చిన నిందితులు.. జైన్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలపాలైన జైన్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ పోలీసులకు జైన్ కీలక వాంగ్మూలం ఇచ్చాడు. తన భార్యను షిండే లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని జైన్ పోలీసులు తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు డోంబివిల్లీకి వెళ్లి.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

ప్రేమకు అడ్డుగా ఉన్నాడే... నిందితుల అరెస్ట్
కాగా తాను జైన్ భార్యను ప్రేమించానని, అడ్డుగా ఉన్నాడనే ఆమె భర్తను చంపేయాలనుకున్నట్లు షిండే పోలీసుల ముందు అంగీకరించాడు. షిండే ఇచ్చిన సమాచారంతో కాల్పులు జరిపిన సవన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు టీవోఐ తన కథనంలో పేర్కొంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications