ఏళ్ల తర్వాత భర్త తిరిగొచ్చాడు, తమ్ముడ్ని పెళ్లాడిన భార్య

 Man killed by snake bite returns 11 years after his wife married his brother
లక్నో: చనిపోయాడనుకున్న వ్యక్తి పదకొండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అయితే, ఆయన భార్య అప్పటికే అతని తమ్ముడిని పెళ్లాడింది. వారిద్దరిని భర్తలుగా అంగీకరించేందుకు సిద్ధమని ఆ మహిళ తెలిపింది. వివరాల్లోకి వెళ్తే... పదకొండేళ్ళ క్రితం బరేలీ ప్రాంతంలోని భడ్వా గ్రామంలో ఛత్రపాల్ అనే వ్యక్తిని పాము కరిచింది.

అచేతనంగా పడిపోయిన ఛత్రపాల్‌ను చనిపోయాడని భావించి అతని కుటుంబ సభ్యులు ఆచారం ప్రకారం ఓ నదిలోకి విసిరేశారు. అప్పటికే ఛత్రపాల్ భార్య ఊర్మిళ గర్భవతి. భర్త మరణం అనంతరం ఆమెకు గర్భం పోయింది. ఆ తర్వాత ఊర్మిళకు ఛత్రపాల్ తమ్ముడితో పెళ్ళయింది.

వారికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. ఇదిలా ఉండగా రెండు రోజులక్రితం ఛత్రపాల్ హఠాత్తుగా ఊడిపడ్డాడు. అతడిని చూసి అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పుడు అతను అసలు విషయం చెప్పాడు.

చనిపోయాడనుకుని కుటుంబ సభ్యలు పారేశారని, అయితే తాను కేవలం స్పృహ కోల్పోయానని తెలిపాడు. కొందరు పాముల వాళ్ళు తనను నీటిలోంచి వెలికి తీసి వారి వైద్యంతో తనను ప్రాణగండం నుంచి గట్టెక్కించారని ఛత్రపాల్ చెప్పాడు ఛత్రపాల్.

అయితే, అప్పటికే ఆయన భార్య తమ్ముడిని పెళ్లాడి కాపురం చేస్తోంది. దీంతో ఛత్రపాల్ డైలమాలో పడ్డాడు. ఆమె ఇద్దరినీ భర్తలుగా అంగీకరిస్తానని తెలిపింది. అయితే, కుటుంబమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ప్రస్తుతం ఆమె ఛత్రపాల్ సోదరుడితోనే ఉంటోంది. ఓ నిర్ణయం తీసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+