కూతుళ్లను, భార్యను చంపేశాడు: ఇంట్లో శవాల పక్కనే
చెన్నై: తమిళనాడులో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 35 ఏళ్ల వ్యక్తి తన 38 ఏళ్ల వయస్సు గల భార్యను, ముగ్గురు సవతి కూతుళ్లను చంపేశాడు. మంగళవారంనాడు అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లో వారి శవాలతోనే గురువారం రాత్రి వరకు ఉన్నాడు.
విషయం తెలిసిన పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిందితుడిని చిన్నరాజ్‌గా గుర్తించారు. అతను కృష్ణగిరి జిల్లా బర్గూరు గ్రామానికి చెందినవాడు. అతని స్వీట్ స్టాల్స్‌లో స్వీట్ మాస్టర్‌గా పనిచేస్తుంటాడు.

అతను రోయపెట్ట పోలీసు స్టేషన్ వెనకనే ముత్తు స్ట్రీట్‌లో పండియమ్మాళ్, ఆమె ముగ్గురు కూతళ్లు పవిత్ర (19), పరిమళ (18), స్నేహ (16) కలిసి అద్దెకు నివాసం ఉంటున్నాడు. పండియమ్మాళ్ కరైకుడికి చెందింది.
చిన్నరాజ్ తాగి ఇంటికి వచ్చేవాడని, ఆ సమయంలో తన ముగ్గురు కూతుళ్లను పెండియమ్మాళ్ అతనికి కనిపించకుండా చూసేదని చెబుతున్నారు. కూతుళ్లపై అసభ్యంగా ప్రవర్తించేవాడని అంటున్నారు.












Click it and Unblock the Notifications