కోడిగుడ్డు కూర కోసం స్నేహితుడి హత్య .. పార్టీకి పిలిచిన పాపానికి ఫ్రెండ్ బలి

కోడి గుడ్డు కూర కోసం స్నేహితుడినే హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. ఇంటికి పార్టీకి పిలిచి భోజనానికి కోడిగుడ్డు కూర చేయలేదని స్నేహితుడిని కడతేర్చిన ఉదంతం మహారాష్ట్రలోని నాగపూర్ లో చోటుచేసుకుంది.
నాగ్‌పూర్‌లోని మంకాపూర్ ప్రాంతంలో భోజనానికి ఒక స్నేహితుని ఆహ్వానించగా, భోజన సమయంలో కోడి గుడ్డు కూర తయారు చేయనందుకు తన స్నేహితుడినే హతమార్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోడి గుడ్డు కూర కోసం హతమార్చానని చెప్పడంతో అది విన్న పోలీసులు షాక్ తిన్నారు.

 Man kills his friend for not making egg curry for dinner

మంకాపూర్ ప్రాంతంలో 40 సంవత్సరాల వయసున్న బనార్సీ అనే వ్యక్తి తలపై గాయాలతో మరణించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అతని స్నేహితుడు గౌరవ్ గైక్వాడ్ పై అనుమానం వచ్చింది. దీంతో అతనిని విచారించగా బనార్సీ హత్య తానే చేసినట్లుగా అంగీకరించాడు. అసలు ఏమి జరిగిందో చెప్పాడు . బనార్సీ తన స్నేహితుడు గౌరవ్ గైక్వాడ్ ను శుక్రవారం విందుకు ఆహ్వానించాడు. వారు అర్ధరాత్రి వరకు తాగారు. పార్టీ చేసుకున్నారు. ఫుల్ గా తాగిన తర్వాత విచక్షణ మరచిపోయిన వారు గొడవకు దిగారు .

భోజన సమయానికి ఇంటికి ఆహ్వానించి కనీసం కోడిగుడ్డు కూర తయారు చేయలేదని స్నేహితుడితో గొడవకు దిగాడు గౌరవ్ గైక్వాడ్ . ఇక ఈ ఘర్షణ పెద్దది కాగా గైక్వాడ్ బనార్సీ తలపై ఇనుప రాడ్ తో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత అక్కడనుండి పరారయ్యాడు . ఆదివారం ఈ విషయం వెలుగులోకి రాగా, దర్యాప్తు జరిపిన పోలీసులు బనార్సీ స్నేహితుడు గౌరవ్ గైక్వాడ్ ను అరెస్ట్ చేశారు .
దీంతో విషయం మొత్తం బయటపడింది .తాగిన మైకంలో స్నేహితుడినే కేవలం కోడిగుడ్డు కూర కోసం హతమార్చాడు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+