నోట్లో గుడ్డలు కుక్కి, కత్తితో పొడిచి భార్య దారుణ హత్య

ఔరంగాబాద్: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల కూతురు ముందే కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు తన నేరాన్ని అంగీకరిస్తూ లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాల్నాకు చెందిన అశోక్ లఖన్‌లాల్ సుర(35)కు, భార్య పూజ (25)కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఉమ్మడి కుటుంబంలో నివసించే వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. మద్యానికి బానిసైన నిందితుడికి కుటుంబసభ్యులు ఇటీవల డ్రగ్ ఎడిక్షన్ చికిత్స కూడా చేయించారు.

కాగా, ఆదివారం ఉదయం అశోక్ ఓ ఉన్మాదిలా మారిపోయాడు. భార్య నోటిలో గుడ్డలు కుక్కి, హింసకు పాల్పడ్డాడు. భార్య నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో.. ఆమె అరుపులు ఎవరికీ వినబడకుండా టీవీ వాల్యూమ్ బాగా పెంచి మరీ ఆమెపై కత్తితో దాడి చేశాడు. గొంతుపై తీవ్రంగా పొడవంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.

Man kills wife in front of 2-year-old daughter in Jalna

అనంతరం అక్కడ్నుంచి పారిపోయిన అశోక్.. పోలీసుల ముందు లొంగిపోయి, నేరాన్ని అంగీకరించాడు. తన తండ్రి.. తన తల్లిని చంపిన విషయాన్ని ప్రత్యక్షంగా చూసిన వారి రెండేళ్ల కూతురు.. తన నానమ్మకు సమాచారం అందించింది.

రక్తపు మడుగులో ఉన్న కోడల్ని చూసి హతాశురాలైన ఆమె చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+