వీడెవడండీ బాబూ.. యూట్యూబ్ చూసి ఆపరేషన్ చేసుకున్నాడు..
ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు మనకు తెలియని ఎన్నో వింతలు, విషయాలు, విశేషాలను మన ముందుకు తీసుకొస్తున్నాయి. యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ద్వారా అనేక తెలియని విషయాలను నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అంతకుమించి ఆలోచించాడు. యూట్యూబ్ చూసి తనకు తానే ఆపరేషన్ చేసుకున్నాడు. ఈ వార్త తెలిసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక వైద్యులైతే అవాక్కయితున్నారు. మరి ఇంతకి సర్జరీ సక్సెస్ అయిందా..? లేక బెడిసి కొట్టిందా..?
సాధారణంగా ఎంబీబీఎస్, పీజీ చేసిన వైద్యులే రోగులకు సర్జరీలు చేస్తారు. కానీ వైద్య పరిజ్ఞానం ఏమాత్రం లేని ఓ యువకుడు తనకు తానే సర్జరీ చేసుకున్నాడు. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మథురాలో జరిగింది.

ఏం జరిగింది..?
ఉత్తర్ ప్రదేశ్ లోని మథురాకు చెందిన 32 ఏళ్ల రాజాబాబు నాలుగు నెలలుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. అనేకమంది వైద్యులను సంప్రదించినా సరైన సమాధానం చెప్పలేక పోయారు. మెడిసిన్ వాడినా ఫలితం లేకపోయింది. దీంతో విసుగుచెందిన రాజాబాబు.. తనకు తానే ఆపరేషన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సర్జరీకి కావాల్సిన ప్రాథమిక పరికరాలను సేకరించాడు. బ్లేడు, సెడెటీవ్ ఇంజెక్షన్, ప్లాస్టిక్ థ్రెడ్ ఇలా కొన్ని సమకూర్చుకున్నాడు.
ఇక యూట్యూబ్ లో కొన్ని సర్జరీ వీడియోలు చూసి పొట్టపై 7 ఇంచుల మేర కోశాడు. పొట్టలో నోప్పికి గల కారణాన్ని వెతికాడు. అతడికి ఏమీ లభించలేదు. దీంతో 11 ఇంచులు మేర కట్ చేశాడు. నొప్పి ఇంకా ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో వాళ్లు హుటాహుటిన రాజాబాబును ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన డాక్టర్లు రాజాబాబు చేసిన పనిని చూసి షాక్ అయ్యారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆగ్రాలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కండీషన్ నిలకడగా ఉందన్నారు. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ చూసి ఇలాంటి ఘటనలకు పాల్పడితే ప్రాణాలకే ముప్పని వైద్యులు హెచ్చరించారు.
-
విజయ్ సంచలన నిర్ణయం.. తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ !! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
ఈ ఫోటోలో ఉన్న గుడ్లగూబను కనిపెట్టగలరా..? -
ఈ ఫోటోలో ఎన్ని జంతువులు ఉన్నాయో చెప్పగలరా..? -
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications