వర్షాల కోసం బలి: మొండెం వదిలేసి తల తీసికెళ్లారు
రాంచి: వానల కోసం ఒక వ్యక్తిని నరబలి ఇచ్చిన సంఘటన జార్ఖండ్ లో సంచలనం రేపింది. హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఎర్పాటు చేసి గాలిస్తున్నారు.
సీనియర్ పోలీసు అధికారి అజయ్ కుమార్ ఠాకూర్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జార్ఖండ్ రాజధాని రాంచికి సమీపంలోని గుల్మా జిల్లాలోని కర్వాది అనే గ్రామంలో థెపా ఖారియా (55) ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఈయన సమీపంలోని మార్కెట్ లో పని చేస్తున్నాడు.

ఇతను ఆదివారం రాత్రి ఇంటిలో ఉన్న సమయంలో కొందరు అక్కడికి వెళ్లారు. తరువాత థెపా మీద దాడి చేసి హత్య చేసి అతని తల నరికి తీసుకు వెళ్లిపోయారు. థెపా మార్కెట్ దగ్గరకు రాకపోవడంతో అతని సోదరుడు జత్రూ వెళ్లి చూడగా విషయం వెలుగు చూసింది. మొండెం మాత్రం ఇంటిలో ఉంది.
జార్ఖండ్ లో ఎండలు మండిపోతున్నాయి. వర్షాలు రాక పంటలు ఎండిపోతున్నాయి. వర్షాలు కురవాలంటే నరబలి ఇవ్వాలనే మూడనమ్మకం అక్కడ ఉంది. తలను తీసుకు వెళ్లి పోలాలలో తగలబెడితే విస్తారమైన వర్షాలు కురుస్తాయని వారి నమ్మకం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications