తనతో డ్యాన్స్ చేయలేదని నెలల గర్భిణీ డ్యాన్సర్‌ని కాల్చేశాడు
పంజాబ్‌లోని భటిండాలో శనివారం రాత్రి దారుణం జరిగింది. ఇరవై రెండేళ్ల ఏళ్ల డ్యాన్సర్‌ని వేదిక పైనే కాల్చి చంపాడు ఓ వ్యక్తి. ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నాడు.
చండీగఢ్: పంజాబ్‌లోని భటిండాలో శనివారం రాత్రి దారుణం జరిగింది. ఇరవై రెండేళ్ల ఏళ్ల డ్యాన్సర్‌ని వేదిక పైనే కాల్చి చంపాడు ఓ వ్యక్తి. ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నాడు. తనతో కలిసి డ్యాన్స్ చేయమని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది.
దీంతో ఆగ్రహానికి గురైన వ్యక్తి తుపాకీతో కాల్చి చంపేశాడు. ఘటన జరిగిన సమయంలో నిందితుడు పూటుగా మద్యం తాగి ఉన్నాడని స్థానికులు తెలిపారు. సదరు డ్యాన్సర్ రెండు నెలల గర్భిణీ కావడం మరో బాధాకరమ విషయం. ఆమెను కాల్చిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసుుల అతని కోసం గాలిస్తున్నారు.

ఓ పెళ్లి వేడుకలో భాగంగా ఓ డ్యాన్స్ గ్రూప్ ఫర్మార్మ్ చేస్తోంది. ఆ డ్యాన్స్ గ్రూప్‌లో బాధితురాలు కూడా సభ్యురాలు. మృతురాలిని కుల్వీందర్ కౌర్‌గా గుర్తించారు. నిందితుడు వేదిక పైకి ఎక్కి, సదరు డ్యాన్సర్‌ను తనతో డ్యాన్స్ చేయాలని అడిగాడు. ఆమె నిరాకరించడంతో తన చేతిలోని పిస్టల్ తీసుకొని కాల్చాడు.
మృతురాలి సోదరుడు విక్రమ్ కుమార్ ఇంగ్లీష్ మీడియాకు చెప్పిన వివరాల ప్రకారం.. కుల్వీందర్ రెండు నెలల గర్భిణీ. తన సోదరిని పెళ్లి కొడుకు సోదరుడు, ఇద్దరు స్నేహితులు కాల్చారని చెప్పాడు. అయితే వీడియోలో మాత్రం ఒక్కరే కాల్చినట్లుగా ఉంది.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications