సాయం కరువై.. అంబులెన్స్ లేక.. బైక్ పైనే భార్య మృతదేహం !

ఈ తరహా ఘటనల గురించి విన్న ప్రతిసారి, సభ్య సమాజం సైతం సిగ్గుపడాలి అని అనిపించడంలో సందేహం అక్కర్లేదు. ఇప్పటికీ ఎన్నోసార్లు ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
ప్రతిసారి మానవత్వం మంటకలిసి పోతుందని రాస్తూనే ఉంటున్నాం. కానీ ప్రజల్లో మాత్రం మార్పు రావట్లేదు. కళ్లు ఎదురుగా కట్టుకున్న భార్య ప్రాణాలు వదిలేస్తే, ఆమె మృతదేహాన్ని సైతం తరలించేందుకు దీనంగా సహాయం కోసం ఎదురుచూసిన ఓ భర్తకు చేదు అనుభవం మిగిలింది. సాయం చేసే వాళ్లు కరువై, సమయానికి అందుబాటులో అంబులెన్స్ కూడా లేకపోవడంతో.. ఏ దిక్కు తోచని పరిస్థితిలో తన బైక్ పైనే ఆమె మృతదేహాన్ని కట్టుకొని స్వస్థలానికి బయలుదేరాడు. ఈ విషాద ఘటనను చూసినవారు పోలీసులకు సమాచారం అందించడంతో వెలుగులోకి వచ్చింది.

అసలు ఏం జరిగిందంటే..?

మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాకు చెందిన 32 ఏళ్ల గ్యార్సి యాదవ్, భర్త అమిత్ యాదవ్‌తో కలిసి గత 10 ఏళ్లుగా మహారాష్ట్రలోని లోనారాలో నివసిస్తున్నారు. రక్షాబంధన్‌ రోజున కుటుంబసభ్యులను కలిసేందుకు, అమిత్ తన భార్యతో కలిసి బైక్‌పై కరణ్‌పూర్‌కు బయల్దేరాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నాగ్‌పూర్-జబల్‌పూర్ జాతీయ రహదారిపై, మోర్ఫాటా ప్రాంతం వద్ద వారి జీవితాన్ని ఒక ట్రక్కు ఢీ కొట్టింది.

man-tied-his-dead-wife-on-bike-while-no-one-helps-and-ambulance-unavailable

ఈ దుర్ఘటనలో గ్యార్సి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రక్తంతో తడిసిన తన భార్య పక్కన కూర్చున్న అమిత్, వాహనదారుల ముందు చేతులు చాచి సహాయం కోరాడు. ఎవరో అంబులెన్స్ పిలుస్తారని, ఎవరో కనీసం ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్తారని ఆశపడ్డాడు. కానీ ప్రతి వాహనం వేగంగా దాటిపోతోంది కానీ సహాయం మాత్రం చేయలేదు. అంబులెన్స్ సర్వీసులు కూడా అందుబాటులో లేవు.. 108 నంబర్‌కు చేసిన కాల్ ఫలితం ఇవ్వలేదని వాపోయారు.

దాంతో అమిత్ తన భార్య మృతదేహాన్ని జాగ్రత్తగా బైక్ వెనుక కట్టాడు. కిలోమీటర్ల దూరం బైక్ నడిపాడు. ఆ దృశ్యాన్ని చూసిన వారు కొందరు వీడియో తీశారు. పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు అతన్నిఆపి, మృతదేహాన్ని మాయో హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా వాహనదారుల నిర్లక్ష్యంపై సర్వత్రా మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+