ఎస్‌బీఐ ఏటీఏంలో పిల్లలు ఆడుకునే నోట్లు పెట్టిన వ్యక్తి అరెస్ట్
ఎస్‌బీఐ ఏటీఎంలో చిన్నపిల్లలు ఆడుకునే నకిలీ రూ.2000 నోట్లు రావడానికి కారకుడైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: ఎస్‌బీఐ ఏటీఎంలో చిన్నపిల్లలు ఆడుకునే నకిలీ రూ.2000 నోట్లు రావడానికి కారకుడైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడైన మహమ్మద్ ఇషా అనే వ్యక్తిని పోలీసులు ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ లో అదుపులోకి తీసుకున్నారు.
దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో బుధవారం చిన్నపిల్లలు ఆడుకునే నకిలీ రూ.2000 నోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. చూడటానికి ఇవి అసలు నోట్లుగానే కనిపించినా.. ఈ నోటుపై ఆర్బీఐకి బదులుగా చిల్డ్రెన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, గ్యారెంటీడ్ బై చిల్డ్రన్స్ గవర్న్‌మెంట్ అని ఉంది. నోటుపై ఒకపక్క చూరన్ లేబుల్ అనిరాసి ఉంది. బ్యాంకు సీల్‌కు బదులుగా పీకే లోగో ఉంది.

దక్షిణ ఢిల్లీలోని చత్తార్‌పూర్ కాల్‌సెంటర్లో పనిచేసే రోహిత్ అనే వ్యక్తికి మొదటగా ఈ నకిలీ నోట్లు రాగా ఈ సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ ఘటనపై ఆ బ్యాంకు అధికారులు కూడా విచారణ చేపట్టారు.
నిందితుడు మహమ్మద్ ఇషా ఏటీఎంలలో నగదు పెట్టే బాధ్యత చేపట్టిన కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడని, అతడే పిల్లలు ఆడుకునే నోట్లను సంగమ్ విహార్ ఏటీఎంలో పెట్టాడని పోలీసులు తెలిపారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications