ఎంపీ టిక్కెట్, నేరుగా ఢిల్లీ వెళ్లిపోయిన సుమలత, అయోమయంలో బీజేపీ హైకమాండ్, ఆ సీటు అంతేనా ?
కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ పొత్తు పెట్టుకోవడంతో కూటమిలో మండ్య లోక్ సభ సీటు ఎవరికి దక్కుతుంది? అని కర్ణాటకలో చర్చనీయాంశమైంది. అదే కారణంతో 2024 లోక్‌సభ ఎన్నిక మండ్య లోక్ సభ నియోజకవర్గం ఆసక్తి రేపుతోంది. మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ జాతీయ సంస్థ ప్రధాన కార్యదర్శి బీ. ఎల్. సంతోష్‌ను వేర్వేరుగా కలవడం హాట్ టాపిక్ అయ్యింది.
దీనిపై ఎంపీ సుమలత అంబరీష్ ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. స్నేహపూర్తకంగా సమావేశమై మండ్య లోకసభ నియోజకవర్గం ఎన్నికలపై చర్చించామని, తమ విలువైన సమయాన్ని వెచ్చించి నా మాటలు విన్నందుకు జేపీ నడ్డాకు, బీఎల్ సంతోష్‌లకు ధన్యవాదాలు అంటూ సుమలత పోస్టు చేశారు. ఇద్దరు నాయకులు తనతో చర్చించి ఎక్కువ సమయం కేటాయించి నా మాటలు విన్న వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సుమలత పోస్టు చేశారు.

2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత వచ్చిన ఫలితాలతో షాక్ అయిన జేడీఎస్ తరువాత బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చెయ్యాలని నిర్ణయించారు. ఇదే సమయంలో లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ కు ఎన్ని సీట్లు కేటాయించాలి అంటూ బీజేపీ హైకమాండ్ ఇప్పటికే మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడతో చర్చించారు. తరువాత పలుసార్లు మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామితో కూడా బీజేపీ హైకమాండ్ చర్చించింది.
2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మండ్య నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించిన సుమలత తరువాత బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మండ్య టిక్కెట్ మాకే ఇవ్వాలని జేడీఎస్ పట్టుబడుతోంది. మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత అంబరీష్ కు ఈసారి బీజేపీ హైకమాండ్ మండ్య లోక్ సభ నియోజక వర్గంలో పీఎం టిక్కెట్ ఇవ్వడం చాలా కష్టం అని వెలుగు చూసింది.
ఇదే సమయంలో మరోసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్న సుమలత ఇప్పుడు ఢిల్లీ చేరుకుని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో వేర్వేరుగా సమావేశం అయ్యి చర్చించారు. అయితే సుమలతకు ఏ నియోజక వర్గం కేటాయిస్తారు ? అనే విషయంలో బీజేపీ నాయకులు ఏమాత్రం క్లూ ఇవ్వకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications