మోడీ నీచమైన వ్యక్తి.. మరోసారి అయ్యర్ ఫైర్

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మణిశంకర్ అయ్యర్. మోడీని ఉద్దేశిస్తూ నీచమైన వ్యక్తిగా గతంలో అభివర్ణించిన అయ్యర్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. మోడీపై తాను మాట్లాడిన తీరును భవిష్యవాణితో పోల్చారు. ఈ నెల 23వ తేదీన ఆయన గద్దె దిగడం ఖాయమంటూ సెటైర్లు వేశారు.

మోడీ నోరు దుర్భరమైంద‌ని ఎద్దేవా చేసిన అయ్యర్.. ఆయన హవా తగ్గిపోయిందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఈసారి బీజేపీ ప్రభుత్వం రావడం కష్టమేనంటూ చెప్పుకొచ్చారు. అయితే అప్పుడెప్పుడో 2017లో మోడీపై ఆరోపణలు గుప్పించిన అయ్యర్.. తాజాగా మరోసారి ఫైరయ్యారు. ఆనాడు మోడీని నీచుడిగా అభివర్ణిస్తూ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. రైజింగ్ కశ్మీర్ అనే వెబ్ సైట్ కు రాసిన వార్తా కథనంలో ఈ విధంగా స్పందించారు.

 Mani Shankar Aiyar justifies his neech aadmi jibe against PM Modi

అదలావుంటే మోడీపై చేసిన వ్యాఖ్యలను మణిశంకర్ అయ్యర్ సమర్థించుకుంటున్న నేపథ్యంలో బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. ఆయన తీరు సరికాదంటూ.. అయ్యార్ మళ్లీ వచ్చాడంటూ బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు ఎద్దేవా చేశారు. మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆనాడు తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పిన అయ్యర్.. మళ్లీ ఇప్పుడు అదే ధోరణిలో మాట్లాడటం తగదంటూ హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+