Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మణిపూర్‌లో మళ్లీ హింస: కాల్పుల్లో ఇద్దరు మృతి, పలువురికి గాయాలు, మహిళల పరుగులు

ఇంఫాల్: గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మంగళవారం రెండు ప్రత్యర్థి జాతుల మధ్య మరోసారి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మైటీ, కుకీ జాతుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

కాల్పులు చోటు చేసుకోవడంతో కొందరు మహిళలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెడుతున్న దృశ్యాలు కొన్ని వైరల్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తున్నారు.

 Manipur violence: Two killed, five injured in fresh clashes between rival ethnic groups

కాగా, మణిపూర్‌లో గత ఏడాది మే ప్రారంభం నుంచి మెయిటీ, కుకీ కమ్యూనిటీల మధ్య దీర్ఘకాలంగా జాతి ఘర్షణలు జరుగుతున్నాయి. ఫలితంగా 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతేగాక, కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా దాదాపు 67,000 మంది వ్యక్తులు తమ ఇళ్లను విడిచిపెట్టి.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

ఈ క్రమంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. మెయిటీ సాయుధ సమూహంలోని ఒక వర్గం, యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF), నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం హింసను త్యజించాలనే నిబద్ధతను కలిగి ఉంది.

శాంతి ఒప్పందానికి ముందు, నవంబర్‌లో, కేంద్రం UNLF, ఇతర ఏడు గ్రూపులపై ఐదేళ్ల నిషేధాన్ని విధించింది. వీటిని సమిష్టిగా Meitei తీవ్రవాద సంస్థలు అని పిలుస్తారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద రూపొందించబడిన నిషేధం.. సాయుధ మార్గాల ద్వారా మణిపూర్ వేర్పాటు కోసం వారి వాదనను ఉదహరించింది. మణిపూర్ రాష్ట్రంలో శాంతి పరిస్థితులను తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+