కిరాకతం: మాయమాటలతో ప్రలోభపెట్టి అమ్మాయిలపై లైంగికదాడులు

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: మాయ మాటలతో టీనేజ్ అమ్మాయిలను ప్రలోభపెట్టి లైంగికదాడులకు పాల్పడేవాడు, అవసరం తీరాక ముఖం చాటేసేవాడు. ఎట్టకేలకు ఓ బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిర్యాదు చేశారు.ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులోని సంజయనగర ఠాణ పోలీసులు అమ్మాయిలను ప్రలోభపెట్టి లైంగిక దాడులకు పాల్పడే మంజునాథన్ ఎట్టకేలకు అరెస్టు చేశారు,.

కలబురగికి చెందిన నిందితుడు సుంకథకట్టెలో ఉంటూ నగరంలోని పలు మురికి వాడల్లో బాలికలను ప్రలోభపెట్టి వరుసగా అత్యాచారానికి పాల్పడ్డాడు.అయితే ఇతరులకు అనుమానం రాకుండా మారు పేర్లను పెట్టుకొన్నాడని పోలీసులు చెప్పారు.

manjunath arrested for sexual harassment in karnataka

మల్లిఖార్జున, హోరి, బసవరాజు, మంజణ్ణ, రవి, రాజ..తదితర పేర్లతో అమ్మాయిలను మోసం చేశాడు మంజునాథ్. అమ్మాయిలను ప్రత్యేకించి టీనేజ్ అమ్మాయిలను పరిచయం చేసుకొని వారికి దుస్తులు, పుస్తకాలు , నగదును ఇచ్చి వారిని వలలో వేసుకొనేవాడు.

తనపై వారికి నమ్మకం కుదిరిందని భావించిన తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడేవాడని డిసిపి లాబూరావ్ వివరించారు.

గత నెల 23న, సాయంత్రం అయిదు గంటలకు గెద్దలహళ్ళిలోని ఒక ప్రభుత్వ పాఠశాల విధ్యార్థినిని మంజునాథ ఇలానే నమ్మించాడు. మంజునాథ మాటలను నమ్మి ఆయన బండిపై వెళ్ళింది ఆ బాలిక.

గృహ ప్రవేశానికి వెళ్ళాలని ఆ బాలికను తీసుకెళ్ళి లైంగికదాడికి పాల్పడ్డాడు.అయితే ఆ బాలిక ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాలిక ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు మంజునాథను అరెస్టు చేశారు.బనశంకరి మూడో స్టేజీలో దొంగిలించిన బైక్ ను బాలికలపై లైంగిక దాడులకు ఉపయోగించుకొనేవాడు మంజునాథ.గత ఏడాది పదిమందిపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
manjunath arrested for sexual harassment in karnataka. around dozen teenage girls harassed by manjunath. on feb 28 school girl complaint against manjunath, police arrested him
Please Wait while comments are loading...