ఆ సలహాను మోడీ పాటించాలి, నేరస్తులకు తప్పుడు సంకేతాలు: మన్మోహాన్ సింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావో అత్యాచార ఘటనలపై ప్రధానమంత్రి మోడీ ఆలస్యంగా స్పందించడాన్ని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తప్పుబట్టారు.
ఈ తరహా ఘటనలు ఘటనలు చోటు చేసుకొన్న సమయంలో వెంటనే ఖండించకపోవడం వల్ల నేరస్తులకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉందని మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్‌సింగ్ చెప్పారు.

ఎట్టకేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయమై నోరు మెదపడం పట్ల తనకు సంతోషంగా ఉందని మన్మోహాన్ సింగ్ వ్యాఖ్యానించారు. మౌనంగా ఉండకుండా తరచుగా మాట్లాడాలని తనకు మోడీ గతంలో సలహా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తనకు ఇచ్చిన సలహాను మోడీ తప్పకుండా పాటించాలని మన్మోహన్ సూచించారు.
కథువా ఘటన గురించి సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో నెటిజన్ల నుండి నిరసనలు వెల్లువెత్తాయి. దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ జరిగిన నేపథ్యంలో ప్రధాని మోడీ నోరు విప్పారు.ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షిస్తామని మోడీ హమీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications