2 రోజులైనా ఏం జరిగిందో తెలియుదు, కోమాలో పాక్: పారికర్
న్యూఢిల్లీ: భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్ నుంచి పాక్ ఇంకా కోలుకోలేదని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఆ దేశ పరిస్థితి సర్జరీ జరిగిన తర్వాత కూడా పేషెంట్ ఇంకా మత్తులో ఉన్న స్థితిగా ఆయన అభివర్ణించారు. హనుమంతునిలాగా భారత సైన్యం తన పరాక్రమాన్ని చూపిందని కొనియాడారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్ మెరుపు దాడుల అనంతర పాక్ పరిస్థితి అనస్థీసియన్ పేషంట్‌లా మారిందని, తనకు సర్జరీ జరిగిందని ఆ పేషెంట్‌కు తెలియని మాదిరిగా ఆ దేశం వ్యవహరిస్తోందన్నారు.

సర్జికల్ స్ట్రయిక్ జరిగి రెండు రోజులు గడుస్తున్నా ఏం జరిగిందో తెలియని స్థితిలో పాకిస్తాన్ ఉందని చెప్పారు. భారత సైన్యాన్ని హనుమంతునితో పోల్చారు. దాడులు చేసేంత వరకూ భారత సైన్యానికి వారి పరాక్రమం తెలియదన్నారు. ఆర్మీ పైన పారికర్ ప్రశంసలు కురిపించారు.
ఇతర దేశాలను ఆక్రమించుకునే ఉద్దేశ్యం అంశంపై పారికర్ స్పందించారు. తమకు మరో దేశాన్ని ఆక్రమించుకోవాలనే కోరిక లేదన్నారు.
భగవాన్ శ్రీరాముడు లంకను గెలిచిన అనంతరం దానిని రావణాసురుడి సోదరుడు విభీషణుడికి ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే బంగ్లాదేశ్ విషయంలో తాము చేసింది అదే అన్నారు. తాము ఎవరికీ చెడు తలపెట్టమని చెప్పారు. కానీ మాకు ఎవరైనా చెడు చేయాలనుకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications