ఆరెస్సెస్ ఆఫీసు ముందే మనుస్మృతి దహనం..! అంబేద్కర్ బాటలో కాంగ్రెస్..!
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఉత్తరాఖండ్ లో పాల్గొన్న సభ తర్వాత ఆ ప్రాంతాన్ని కర్ణిసేన కార్యకర్తలు శుద్దీకరణ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఖర్గే పాల్గొన్న సభా స్ధలిని ఇలా శుద్ధీకరణ చేయడం ద్వారా దళితుల్ని బీజేపీ అనుబంధ హిందూ సంఘాలు అవమానించాయని, వారిపై తక్షణం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. అయితే ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కులాల్ని రెచ్చగొట్టారంటూ ఆయనపై కేసు నమోదు చేసింది. దీంతో ఆగ్రహంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ మనుస్మృతిని (Manusmriti) తగులబెట్టి నిరసన తెలిపాయి.
ఢిల్లీలోని ఆరెస్సెస్ హెడ్ క్వార్టర్స్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా చేరుకున్నారు. తమతో పాటు తెచ్చుకున్న మనుస్మృతి కాపీల్ని బయటకు తీసి తగులబెట్టాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్దం కాలేదు. వెంటనే తేరుకున్న పోలీసులు.. మనుస్మృతిని తగులహెట్టిన కాంగ్రెస్ కార్యకర్త ఉదిత్ రాజ్ ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఢిల్లీలో, అదీ ఆరెస్సెస్ హెడ్ క్వార్టర్స్ ముందు జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కేశవ్ కుంజ్ లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం వద్దకు తాను వచ్చానని, అక్కడ తాను మనుస్మృతిని దహనం చేశానని ఉదిత్ రాజ్ తెలిపాడు. తమ నాయకుడు మల్లిఖార్జున ఖర్గేను అవమానించారని, అలాగే రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఇందుకు నిరసనగానే తాను ఈ చర్యకు పాల్పడినట్లు అతను వెల్లడించాడు. ఖర్గేను లక్ష్యంగా చేసుకుని జరిగిన శుద్దీకరణను కులపరమైన అవమానంగా పేర్కొంటూ కాంగ్రెస్, మిత్రపక్ష దళిత సంఘాలు ఇప్పటికే మండిపడుతున్నాయి. హల్ద్వాని ఘటనను బహిరంగంగా విమర్శించిన విపక్ష నేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ వివాదం మరింత ముదిరింది. వ్యవస్థాగత కుల అసమానతలకు నిరసనగా అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న మనుస్మృతిని దహనం చేసిన విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ నేతలు రిపీట్ చేశారు.














Click it and Unblock the Notifications