హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుపాకులు ఇచ్చింది... షో కోసం కాదు... దిశ ఎన్‌కౌంటర్‌లో మద్దతు పలికిన ఎంపీలు

|
Google Oneindia TeluguNews

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ప్రజలు ,ప్రజాప్రతినిధులు తెలంగాణ పోలీసులు చర్యను సమర్ధిస్తుండగా.. ఏకంగా పార్లెమెంట్‌లో సైతం ఎన్‌కౌంటర్ పై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికార బీజేపీ తోపాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను సమర్ధించారు. మరోవైపు పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎన్‌కౌంటర్‌కు మద్దతు పలికిన బీజేపీ ఎంపీ

ఎన్‌కౌంటర్‌కు మద్దతు పలికిన బీజేపీ ఎంపీ

ఈ నేపథ్యంలోనే దిశ హత్యోదంతంపై మాట్లాడిన బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖీ తెలంగాణ పోలీసులకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఆయుధాలు ఇచ్చింది. కేవలం షో కోసం కాదని అన్నారు. చట్టప్రకారమే తెలంగాణ ప్రభుత్వం వ్యహరించినట్టు ఆమె పెర్కోన్నారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలకు ఉందని అన్నారు.

బాధితులకు సత్వర న్యాయం జరగాలి,

బాధితులకు సత్వర న్యాయం జరగాలి,

అంతకు ముందు తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ మాట్లాడుతూ.. తాను ఎన్‌కౌంటర్లను సమర్ధించనని చెబుతూనే... ఇలాంటీ కేసుల్లో న్యాయవ్వవస్థ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఎన్‌కౌంటర్‌పై ఫేస్‌బుక్‌లో ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నారని అన్నారు. అయితే ఇలాంటీ కేసుల్లో సత్వర న్యాయం జరిగితే.. ప్రజలు ఇలా ఎన్ కౌంటర్లు చేయాలని అడగరని ఆమె అన్నారు.

 సమర్ధించిన కాంగ్రెస్ పక్ష నేత ఆధీర్ రంజన్ చౌదరీ

సమర్ధించిన కాంగ్రెస్ పక్ష నేత ఆధీర్ రంజన్ చౌదరీ

ఇక చర్చలో పాల్గోన్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరీ తెలంగాణ పోలీసులు చర్యను సమర్ధించారు. ఇలాంటీ సంఘటనల్లో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని కోనియాడారు. ఇలాంటీ సమయంలో పోలీసుకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఉన్నావో ఉదంతంపై కేంద్రంపై నిప్పులు చెరిగారు

English summary
The killing of four accused in the Telangana rape and murder by the police set up a fiery debate in parliament today. Many MPs backed the Telangana police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X