Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మావోయిస్ట్ అమరుల వారోత్సవాలు: సుక్మాజిల్లాలో 5లక్షల రివార్డున్న మావోయిస్ట్ హతం; మహారాష్ట్రలోనూ అలజడి

మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలలో అలజడి చోటుచేసుకుంటుంది. మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తారని హెచ్చరికలతో ప్రతి రాష్ట్రంలోనూ సరిహద్దు అటవీ ప్రాంతాలలో పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోంది. ఇక తాజాగా మావోయిస్టు ప్రభావిత సుక్మా జిల్లాలో భద్రతా సిబ్బంది ఒక మావోయిస్టును కాల్చి చంపిన ఘటన చోటు చేసుకుంది.

 కాటేకల్యాణ్ ఏరియా కమిటీ సభ్యుడు రాకేష్ మడ్కమ్‌ హతం

కాటేకల్యాణ్ ఏరియా కమిటీ సభ్యుడు రాకేష్ మడ్కమ్‌ హతం

ఎనిమిది మందిని హతమార్చిన హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న కాటేకల్యాణ్ ఏరియా కమిటీ సభ్యుడు రాకేష్ మడ్కమ్‌ ను తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో హతమార్చారు పోలీసులు. అతని తలపై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. దంతెవాడ జిల్లా నుండి జిల్లా రిజర్వ్ గార్డ్స్ యొక్క దళాలు అంతర్-జిల్లా సరిహద్దుల వెంబడి నక్సల్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా కూంబింగ్ ఆపరేషన్ చేయడానికి వెళ్లిన క్రమంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

బింద్రపాణి గ్రామ సమీపంలో మావోయిస్ట్ లకు పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్

బింద్రపాణి గ్రామ సమీపంలో మావోయిస్ట్ లకు పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్


దంతెవాడ ఎస్పీ సిద్ధార్థ్ తివారీ సరిహద్దుల్లో మావోయిస్టుల ఉనికి గురించి అందిన నిర్దిష్ట ఇన్‌పుట్‌ల ఆధారంగా, డీఆర్జి బృందం నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలకు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించగా మావోయిస్టులు తారసపడ్డారు అని బింద్రపాణి గ్రామ సమీపంలోని అడవులలో డిఆర్‌జి మరియు మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని పేర్కొన్నారు. కొంతసేపటి తర్వాత మావోయిస్టులు దట్టమైన అడవిలోకి పారిపోయారని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించగా ఓ మావోయిస్టు మృతదేహం లభ్యమైందని వెల్లడించారు.

మృతి చెందిన మావోయిస్ట్ తలపై 5 లక్షల రివార్డు

మృతి చెందిన మావోయిస్ట్ తలపై 5 లక్షల రివార్డు

మృతిచెందిన మావోయిస్టు రాకేష్ మడ్కం తలపై రూ. 5 లక్షల నగదు రివార్డు ఉందని, అతనిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఎనిమిదికి పైగా వివిధ కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మావోయిస్టులకు సంబంధించిన సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నామని, ఆపరేషన్‌ను తిరిగి ప్రారంభించామని ఆయన తెలిపారు.

 మహారాష్ట్రలో మావోయిస్ట్ బ్యానర్ కలకలం .. వైద్యుడితో పాటు అంబులెన్స్ డ్రైవర్ అరెస్ట్

మహారాష్ట్రలో మావోయిస్ట్ బ్యానర్ కలకలం .. వైద్యుడితో పాటు అంబులెన్స్ డ్రైవర్ అరెస్ట్


ఇదిలా ఉంటే మావోయిస్టు అమరుల వారోత్సవాల సందర్భంగా మహారాష్ట్ర దక్షిణ గడ్చిరోలిలోని అహేరి తాలూకాలోని కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఇన్‌చార్జి డాక్టర్ పవన్‌కుమార్ ఉయికే, అంబులెన్స్ డ్రైవర్ ప్రఫుల్ బాట్ మరియు అతని బంధువు అనిల్ బాట్‌ను కమలాపూర్-దామ్‌రాంచ రోడ్డులో మావోయిస్టుల బ్యానర్ ఏర్పాటు చేయడం వెనుక వారి పాత్ర ఉందని ఆరోపిస్తూ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, అతను సీనియర్ మావోయిస్టు క్యాడర్‌లతో కూడా కొన్ని సమావేశాలు జరిపాడని సమాచారం.

మావోయిస్టుల లాజిస్టిక్స్ ప్రొవైడర్ మరియు ఇన్ఫార్మర్‌గా పని చేస్తున్న పీహెచ్సీ వైద్యుడు

మావోయిస్టుల లాజిస్టిక్స్ ప్రొవైడర్ మరియు ఇన్ఫార్మర్‌గా పని చేస్తున్న పీహెచ్సీ వైద్యుడు


పీహెచ్సీ వైద్యుడి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, ఐఫోన్లు, పెన్ డ్రైవ్‌లు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం, డాక్టర్ ఉయికే మావోయిస్టుల లాజిస్టిక్స్ ప్రొవైడర్ మరియు ఇన్ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడని సమాచారం . మావోయిస్టులకు మందులు సరఫరా చేయడంతో పాటు అనారోగ్యంతో ఉన్న కార్యకర్తలకు వైద్యం అందిస్తున్నట్టుగా డాక్టర్ ఉయికే గురించి భద్రతా బలగాలకు సమాచారం అందింది. పిహెచ్‌సి అంబులెన్స్‌ను మావోయిస్టులు కూడా ఉపయోగించినట్లు తెలిసింది. అయితే వివరాలు ఇంకా ధృవీకరించబడలేదు. దీనిపై గడ్చిరోలి పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+