వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహర్‌లో రైల్వేస్టేషన్‌పై మావోల దాడి: ముగ్గురి కిడ్నాప్

By Narsimha
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌లోని మధుసూదన్ రైల్వే స్టేషన్‌పై నక్సలైట్లు మంగళవారం రాత్రి మెరుపుదాడికి దిగారు. అసిస్టెంట్ స్టేషన్ మేనేజర్ (ఏఎస్ఎమ్) సహా ముగ్గురు రైల్వే అధికారులను అపరించుకుని వెళ్లారు.

బుదవారం నాడు బీహార్, జార్ఖండ్ బంద్‌కు నక్సలైట్లు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. మాల్డా డివిజినల్ రైల్వే మేనేజర్‌ (డీఆర్ఎం)కు ఫోన్ చేసిన ఏఎస్ఎమ్.. మసుదాన్ మార్గంలోని పట్టాలపై రైళ్లు నడిపితే నక్సలైట్లు చంపేస్తామని బెదిరించినట్టు చెప్పారు.

Maoists abduct porter, torch properties; train services affected

మంగళవారం మూకుమ్మడిగా రైల్వేస్టేషన్‌పై దాడిచేసిన నక్సలైట్లు.. స్టేషన్ లోపలి ఆస్తులను తగలబెట్టారు. ఈ సంఘటనతో భాగల్పూర్-కియూల్ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అపహణకు గురైన అధికారులను విడిపించేందుకు సీఆర్‌పీఎఫ్ బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.

English summary
A group of maoists allegedly abducted a porter from Madhusudan halt in Munger and torched some of the railway station property late Tuesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X