బీజేపీలో చేరనున్న బాబూలాల్ మారండీ.. పధకం ప్రకారమే పార్టీ విలీనం...!
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ వికాస్ మోర్ఛా పార్టీ అధినేత బాబూలూల్ మారండీ భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఆయన తన మద్దతుదారులతో కలిసి కాషాయ కండువా కప్పుకోనున్నారు.
ఐతే, ఇటీవల జార్ఖండ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జార్ఖండ్ వికాస్ మోర్ఛా పార్టీని అక్కడి ప్రజలు తిరస్కరించిన విషయం తెలిసిందే. బాబాలాల్ మరాండీ కూడా ఓటమిపాలయ్యారు. జార్ఖండ్ ఏర్పడిన 2000వ సంవత్సరంలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రానికి సేవలందించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో జార్ఖండ్ వికాస్ మోర్ఛా పార్టీ తరుపున 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. 81 అసెంబ్లీ స్ధానాలున్న జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీకి 37 స్ధానాలు, దాని మిత్ర పక్షం ఏజేఎస్‌యూ పార్టీకి 5 స్ధానాలు దక్కడంతో.. జార్ఖండ్ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇప్పుడు బాబూలాల్ మారండీ బీజేపీలో చేరడం వల్ల అసెంబ్లీలో బీజేపీ 50కు చేరనుంది. బీజేపీలో తాను చేరే విషయంపై స్పందించిన బాబూలాల్ మారండీ ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని అన్నారు. జార్ఖండ్ ప్రజల తీర్పుని తాను గౌరవిస్తానని అన్నారు.
ఇక జార్ఖండ్ బీజేపీ చీఫ్ రవీంద్ర రాయ్ మాట్లాడుతూ త్వరలో మారండీ బీజేపీతో చేరనున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతుతో పాటు పార్టీని కూడా విలీనం చేసేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ మిత్రపక్షమైన ఏజెఎస్‌యూ ప్రభుత్వానికి మద్దతిచ్చినందుకు గాను డిప్యూటీ సీఎం పదవి, క్యాబినెట్ మంత్రి పదవితో పాటు రాజ్యసభ సీటు కవాలంటోందని సమాచారం.
మిత్రపక్షమైన ఏజెఎస్‌యూ మరింత బలం పుంజుకునేందుకు వీలు లేకుండా మాజీ బీజేపీ ముఖ్యమంత్రి అయిన బాబూలాల్ మారండీని కలుపుకుంటే ఏ ఇబ్బంది ఉండదనే ఉద్దేశ్యంతోనే మారండీని బీజేపీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
మిత్రపక్షమైన ఏజెఎస్‌యూ తన డిమాండ్లను తీర్చని పక్షంలో ప్రభుత్వ మద్దతు ఉపసంహరించుకుంటే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇప్పుడు జార్ఖండ్ వికాస్ మోర్ఛా పార్టీని విలీనం చేసుకుంటే అసెంబ్లీ ప్రభుత్వ బలం 45 ఉంటుంది. కాబట్టి బాబూలాల్ మారండీ పార్టీని బీజేపీలోకి విలీనం చేసే దిశగా పావులు కదుపుతుంది.












Click it and Unblock the Notifications