వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిక్కర్ షాపు ఎదుట మూడు ముళ్లతో ఒక్కటైన జంట... ఇదో రకం నిరసన... ఎందుకిలా చేశారంటే...

|
Google Oneindia TeluguNews

సాధారణంగా నిరసన అంటే రోడ్లపై ర్యాలీలు,ప్రదర్శనలు,ఆటా-పాటా, నల్ల బ్యాడ్జీలు ధరించడం,గుండు గీయించుకోవడం... ఇలా చాలా నిరసన రూపాలు చూసుంటాం. కానీ 'పెళ్లి' ద్వారా కూడా నిరసన తెలియజేయవచ్చునని నిరూపిస్తున్నారు మలయాళీలు. కేరళలోని కోజికోడ్‌లో ఓ జంట లిక్కర్ షాపు ముందు పెళ్లి చేసుకుని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసింది. ఎందుకీ నిరసన... లిక్కర్ షాపు ముందే ఎందుకు పెళ్లి చేసుకున్నట్లు...

కేరళ క్యాటరర్స్ అసోసియేషన్ పిలుపు

కేరళ క్యాటరర్స్ అసోసియేషన్ పిలుపు

కరోనా కట్టడికి విధించిన ఆంక్షల్లో భాగంగా వివాహాది శుభ కార్యాలకు కేవలం 50 మందికి మాత్రమే కేరళ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ఈ నిబంధన కారణంగా తమకు ఉపాధి లేకుండా పోయిందని కేరళలోని క్యాటరర్స్ వాపోతున్నారు. శుభకార్యాలకు తక్కువ మంది హాజరవుతుండటంతో తమకు ఆర్డర్స్ రావట్లేదని... దాంతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ వ్యాప్తంగా మంగళవారం(జులై 6) అన్ని లిక్కర్ షాపుల ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టాలని రాష్ట్ర క్యాటరర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది.

లిక్కర్ షాపు ఎదుటే ఎందుకు...

లిక్కర్ షాపు ఎదుటే ఎందుకు...

ఇందులో భాగంగానే ప్రమోద్-ధన్య అనే జంట కోజికోడ్‌లోని ఓ లిక్కర్ షాపు ఎదుట పెళ్లి చేసుకుని నిరసన తెలియజేశారు. ఈ ఇద్దరూ క్యాటరింగ్ రంగంలోనే చాలాకాలంగా పనిచేస్తున్నారు. అసోసియేషన్ పిలుపు మేరకు నిరసన ప్రదర్శనల్లో పాల్గొనాలనుకున్న ఈ జంట... ఏకంగా లిక్కర్ షాపు ఎదుటే ఇలా మూడుముళ్లతో ఒక్కటైంది. లిక్కర్ షాపుల వద్ద ఎంతమంది గుమిగూడినా పట్టించుకోని ప్రభుత్వం.. శుభకార్యాలకు మాత్రం 50 మంది మాత్రమే హాజరు కావాలని ఆంక్షలు విధించడమేంటని ఈ జంటతో పాటు క్యాటరర్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తున్నారు. అందుకే ఇలా లిక్కర్ షాపు ఎదుట పెళ్లి చేసుకుని నిరసన తెలియజేశామని చెబుతున్నారు.

క్యాటరర్స్ డిమాండ్...

క్యాటరర్స్ డిమాండ్...


'లిక్కర్ షాపుల వద్ద చూడండి... భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అక్కడ ఎంతమంది గుమిగూడినా ఎవరికీ ఏ బాధ లేదు. ప్రభుత్వం ఇకనైనా వివాహాది శుభకార్యాలకు కనీసం 100 మందిని అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాం.' అని కేరళ క్యాటరర్స్ అసోసియేషన్ వెల్లడించింది. కేరళలో చిన్నా,పెద్దా క్యాటరర్స్ కలిపి మొత్తం 2వేల వరకు రిజిస్టర్డ్ క్యాటరర్స్ ఉన్నాయి. దాదాపు 2 లక్షల మంది దీనిపై ఆధారపడి బతుకుతున్నారు. కోవిడ్ కారణంగా ఏడాది కాలంగా ఈ రంగంపై తీవ్ర ప్రభావం పడటంతో చాలామందికి ఉపాధి లేకుండా పోయింది. కోవిడ్ ఆంక్షలను సడలించి శుభకార్యాలకు ఎక్కువమందిని అనుమతిస్తే తప్ప తమకు ఉపాధి దొరకదని వారు వాపోతున్నారు.

English summary
All Kerala Caterers' Association had earlier announced a protest outside liquor shops and other places across the state against the state government's decision to cap the limit of guests for wedding functions at 50.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X