ముంబైలో అగ్ని ప్రమాదం, మంటలార్పుతున్న ఫైరింజన్లు
ముంబై: దక్షిణ ముంబైలోని నవరంగ్ థియేటర్ వద్ద ఉన్న టోడి మిల్స్ కాంపౌండ్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకొన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. 12 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.
ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు చెబుతున్నారు. ఈ స్టూడియో శిథిలమైన భవనంలో ఉంది. చాలా కాలం నుండి ఈ భవనం మూసేసి ఉంచినట్టు స్థానికులు చెబుతున్నారు.

మంటలు అదుపు చేసేందుకు వచ్చిన ఫైర్ సిబ్బందిలో దినేశ్ పాటిల్ అనే యువకుడు మంటలు అంటుకుని గాయపడ్డాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నవ్‌రంగ్ స్టూడియో చాలా పురాతనమైనదే కాకుండా, ఖాళీగా ఉండడంతో ప్రాణ నష్టం తప్పింది.
మంటలు అదుపు చేయడం తొలుత చాలా కష్టంగా మారిందని, బిల్డింగ్‌ను చేరుకునే వీలులేక ఇబ్బందులు పడినట్టు అగ్నిమాపక అధికారులు తెలిపారు. మొత్తం 8 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసినట్టు తెలిపారు. అలాగే స్టూడియో చుట్టుపక్కల ఉన్న భవనాలకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు
ఇటీవల కాలంలో ముంబైలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. భవనాలు నిర్మించే సమయంలో సరైన అగ్ని ప్రమాద నివారణ చర్యలను తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.












Click it and Unblock the Notifications