Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇంటర్ అమ్మాయిల మీద యాసిడ్ పోసిన ఎంబీఏ స్టూడెంట్, కడబలో కలలకం !

కళాశాలలో పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్న ముగ్గురు మహిళా కళాశాల విద్యార్థినులపై యాసిడ్‌ దాడి జరిగిన ఘటన కర్ణాటకలోని మంగళూరు సమీపంలో కలకలం రేపింది.

ఈ దారుణ ఘటన దక్షిణ కన్నడ జిల్లాలోని కడబ ప్రభుత్వ కళాశాలలో చోటుచేసుకుంది. కేరళకు చెందిన వ్యక్తిగా చెప్పబడుతున్న దుండగుడు కళాశాల వరండాలో కూర్చున్న ముగ్గురు పీయూసీ విద్యార్థినులపై యాసిడ్ దాడి చేశాడు

MBA student who attacked PUC college girls with acid near Managaluru

కేరళకు చెందిన అబీన్‌ యాసిడ్ బాటిల్ తీసుకుని కాలేజ్ అమ్మాయి వద్దకు వెళ్లాడు. తరువాత పుస్తకాలు చూసుకుంటున్న అమ్మాయిలపై యాసిడ్ విసిరేశారు. ప్రస్తుతం కడబ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు తాను చేసిన నేరానికి గల కారణాలను చెప్పాడని పోలీసులు తెలిపారు. దక్షిణ కన్నడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రిష్యంత్ సిబి యాసిడ్ దాడి కేసుకు సంబంధించి మీడియాకు సమాచారాన్ని చెప్పారు. ఇది ప్రేమ వ్యవహారంలో రివైంజ్ గా నిందితుడు యాసిడ్ దాడి చేశాడని ఆయన అన్నారు.

అయితే యాసిడ్ తక్కువ తీవ్రత కలిగి ఉందని, ఈ యాసిడ్ నుంచి బొబ్బలు వచ్చాయని, యువతి ముఖంపై యాసిడ్‌ పోశాడని జిల్లా ఎస్పీ రిష్యంత్ తెలిపారు. యువతుల చేతులపై యాసిడ్‌ పడిందని జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే నిందితుడు అబీన్ అదుపులోకి తీసుకుని అతని నుండి యాసిడ్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రిష్యంత్ తెలిపారు. దొరికిన యాసిడ్‌పై అతను ఎక్కడి నుంచి యాసిడ్ తీసుకు వచ్చాడు అని ఆరా తీస్తున్నామని ఆయన వివరించారు.

ప్రాథమిక విచారణలో ప్రేమ విషయంలోనే తాను యాసిడ్ దాడి చేశానని నిందితుడు అంగీకరించాడని, ప్రస్తుతం ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని, ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ రిష్యంత్ తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం నిందితుడు అబిన్ కథనం ప్రకారం ఇంటర్ కాలేజీ యువతిపై యాసిడ్‌ దాడికి ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని తెలిసింది.

ఎంబీఏ చదవుతున్న నిందితుడు అబిన్‌ అతన మతానికి చెందిన ఇంటర్ అమ్మాయిని ప్రేమించాడు. అయితే తాను చదువుకుంటున్నానని, నేను నిన్ను ప్రేమించలేనని, కాలేజ్ చదువులు పూర్తి అయిన తరువాత తాను ఉద్యోగం చెయ్యాలని ఆశపడుతున్నానని ఇంటర్ అమ్మాయి అబిన్ కు తేల్చి చెప్పింది. తన ప్రేమను నిరాకరించిన యువతి మరో అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదని, ఆమె ముఖం ఎవ్వరూ చూడకూడదు అనే కోపంతో ఆమె మీద యాసిడ్ దాడి చెయ్యడానికి అబిన్ స్కెచ్ వేశాడు.

MBA student who attacked PUC college girls with acid near Managaluru

కాలేజ్ వరండాలో కాలేజ్ అమ్మాయి కుర్చున్న చోటనే మరో ఇద్దరు అమ్మాయిల కూడా ఉండటంతో ముగ్గురి మీద యాసిడ్ పోసేశాడని పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం ఇంటర్ పరీక్ష రాయడానికి ముందుగా వెళ్లిన అమ్మాయిలు పరీక్షా కేంద్రంలోని వరండాలో కుర్చుని ఉన్న సమయంలో యాసిడ్ దాడి జరిగిందని, నిందతుడు అబిన్ ను విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+