చివరిదశలో వారే కీలకం.. పూర్వాంచల్‌పై పట్టుకై పార్టీల ప్రయత్నం..

వారణాసి : సార్వత్రిక ఎన్నికల చివరి దశ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్రంలో అధికారం చేపట్టేందుకు దగ్గరి దారి అయినఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ రీజియన్‌లో ఏడో దశలో ఎన్నిక జరగనుంది. ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ - బీఎస్పీ కూటమి శక్తివంచనలేకుండా కృషి చేస్తున్నాయి. అయితే ఆ ప్రాంతంలో పార్టీల అదృష్టం ఎంబీసీ వర్గం దయపై ఆధారపడి ఉంది.

10శాతం ఎంబీసీలు

10శాతం ఎంబీసీలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓబీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. జనాభాలో వారి సంఖ్య 43.56శాతం ఉండగా.. 10.22 శాతం మంది ఎంబీసీలు ఉన్నారు. అయితే తూర్పు యూపీలో మాత్రం ఓబీసీల కన్నా ఎంబీసీలే ఎక్కువ. పూర్వాంచల్ ప్రాంతంలో వారికున్న ప్రాధాన్యం దృష్ట్యా రాజకీయ పార్టీలన్నీ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎంబీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశాయి .

ఎంబీసీల కోసం కమిటీ

ఎంబీసీల కోసం కమిటీ

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యూపీ సీఎంగా ఉన్న సమయంలో ఎంబీసీలపై ప్రత్యేక దృష్టి సారించారు. వారి అభివృద్ధి కోసం కమిటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ సైతం వారి అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టింది. ములాయం సింగ్ తన హయాంలోనే ఎంబీసీల్లో 17కులాల వారిని ఎస్సీల్లో చేర్చి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వారి డిమాండ్‌ను నెరవేర్చారు.

గతంలో బీజేపీకి ఎంబీసీల మద్దతు

గతంలో బీజేపీకి ఎంబీసీల మద్దతు

2014 లోక్‌సభ ఎన్నికలతో పాటు 2017 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంబీసీలు బీజేపీకి అండగా నిలిచారు. ఈసారి కూడా వారి మద్దతు తమకే లభిస్తుందని, కమలదళం భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్, ఎస్పీ - బీఎస్పీ కూటమి సైతం ఎంబీసీలను తమవైపు తిప్పుకునేందుకు జోరుగానే ప్రయత్నాలు సాగించంది. జాతీయ పార్టీలు ఆయా ప్రాంత స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకోవడంతో పాటు టికెట్ల కేటాయింపులో ఎంబీసీలకు ప్రాధాన్యం ఇచ్చాయి.

టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం

టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం

తూర్పు యూపీలో సంత్ కబీర్ నగర్, గోరఖ్‌పూర్, ఖుషీనగర్, సలీంపూర్, వారణాసి, ఘాజీపూర్, బలియాల్లో ఎంబీసీలు భారీ సంఖ్యలో ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు అందుకు తగ్గట్లుగానే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బీజేపీ రాష్ట్రీయ నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్‌తో పొత్తు పెట్టుకుని ఆయన కొడుకు ప్రవీణ్ నిషాద్‌కు సంత్ కబీర్ నగర్ టికెట్ ఇచ్చింది. భారతీయ సమాజ్ పార్టీతో తెగదెంపులు చేసుకున్న బీజేపీ ఆ స్థానాన్ని రాజ్‌భర్ సామాజిక వర్గానికి చెందిన నేతకు కట్టబెట్టంది. అటు కాంగ్రెస్ సైతం ఇదే స్ట్రాటజీ ఫాలో అయింది. పూర్వాంచల్‌లో అతిపెద్ద సామాజిక వర్గమైన సైత్వార్లను ఆకట్టుకునేందుకు ఆర్పీఎన్ సింగ్‌ను రంగంలోకి దిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+