మోడీ దెబ్బ: ఐదుగురు కాంగ్రెసు ఎమ్మెల్యేల రాజీనామా

Posted By:
Subscribe to Oneindia Telugu

షిల్లాంగ్: మేఘాలయలో కాంగ్రెసుకు బిజెపి దెబ్బ పడింది. కాంగ్రెసుకు చెందిన ఐదుగురు శాసనసభ్యులు రాజీనామా చేశారు. శుక్రవారంనాడు మొత్తం ఎనిమండుగురు శాసనసభ్యులు రాజీనామా చేశారు. వారు బిజెపి మిత్ర పక్షం నేషనల్ పీపుల్స్ పార్టీలో చేరనున్నారు.

వచ్చే ఫిబ్రవరిలో శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారు రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాల వల్ల ముకుల్ సంగ్మా నేతృత్వంలోని కాంగ్రెసు ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లే.

Meghalaya jolt for Congress: 8 MLAs, including 5 from party, quit to join BJP ally

రాజీనామా చేసినవారిలో మాజీ ఉప ముఖ్యమంత్రి రోవెల్ లింగోడ్ కూడా ఉన్నారు. కాంగ్రెసేతర ఎమ్మెల్యేల్లో ఒకరు యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ ఎమ్మెల్యే కాగా, తక్కిన ఇద్దరూ ఇండిపెండెంట్లు.

రాజీనామా అనంతరం రోవెల్ లింగోడ్ మీడియాతో మాట్లాడారు. రాజీనామా ఇచ్చిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వచ్చేవారంలో నేషనల్ పీపుల్స్ పార్టీ తలపెట్టిన ర్యాలీలో ఆ పార్టీలో చేరుతారని ఆయన చెప్పారు.

మొత్తం 60 మంది సభ్యుల మేఘాలయ అసెంబ్లీలో కాంగ్రెస్‌‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పి.ఎన్.సీయం రాజీనామా చేశారు. దాంతో కాంగ్రెస్ బలం ప్రస్తుతం 24కు పడిపోయంది.

మేఘాలయ అసెంబ్లీ గడువు 2018 మార్చి 6వ తేదీలో మగియనుంది. వచ్చే ఏడాది నాగాలాండ్, త్రిపురతో కలిసి మేఘాలయ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Eight legislators from Meghalaya, including five from the ruling Congress, resigned from the state assembly on Friday

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి