కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వింత 'హోలీ'... వందేళ్ల ఆచారం... అక్కడ మగవాళ్లు ఆడవాళ్లుగా మారుతారు... నోటికొచ్చినట్లు దూషిస్తారు...

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కరోనా కారణంగా ఈసారి హోలీ వేడుకలను నిషేధించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కరోనా నిబంధనలు పాటిస్తూ హోలీ జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్ర ప్రజలు ఆదివారం(మార్చి 28) హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఎప్పటిలాగే కర్నూలు జిల్లా ఆదోనిలో స్థానికులు తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఇక్కడి సంప్రదాయం ప్రకారం హోలీ పండుగ రోజు మగవాళ్లు కట్టు,బొట్టుతో అచ్చం ఆడవాళ్లలా తయారవుతారు.

నోటికొచ్చినట్లు దూషిస్తారు...

నోటికొచ్చినట్లు దూషిస్తారు...

స్థానిక సంప్రాదాయం ప్రకారం... హోలీ రోజు నిష్టతో రతి,మన్మథులను కొలుస్తారు. ఇందుకోసంమగవారు చీర కట్టుకుని... బొట్టు,పూలు,నగలతో సింగారించుకుంటారు. ఆ తర్వాత నైవేద్యంతో నింపిన కుంభాన్ని నెత్తిన పెట్టుకుని ఆలయానికి బయలుదేరుతారు. దారిలో తెలిసిన వ్యక్తులు,సన్నిహితులు కనబడితే వారిని నోటికొచ్చినట్లు దూషిస్తారు. ఆ వ్యక్తులు గతంలో ఏవైనా చెడు పనులు చేసి ఉంటే... వాటన్నింటిని ఏకరువు పెట్టి మరీ తిడుతారు. ఆ సమయంలో వారు తిట్టే తిట్లను చాలామంది దైవ ఆశీస్సులుగా భావిస్తారు.

తరతరాలుగా కొనసాగుతున్న సంప్రాదాయం...

తరతరాలుగా కొనసాగుతున్న సంప్రాదాయం...

బయటి జనాలకు ఇది వింతగా అనిపించవచ్చు గానీ... ఇక్కడ తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రాదాయం కొనసాగుతోంది. ఫాల్గుణ మాసం శుద్ద దశమి సందర్భంగా నిర్వహించే ఈ వేడుకలు ఆదివారం నుంచి రెండు రోజుల పాటు కొనసాగుతాయి. అంతకు రెండు రోజుల ముందే ఈ ఉత్సవ నిర్వాహకులు భాజాభజంత్రీలతో ఇంటింటికి వెళ్లి రంగులు చల్లి వేడుకలు జరుపుతారు. ఆది,సోమవారాల్లో గ్రామం నడిబొడ్డున ఉన్న ఆలయంలో రతి,మన్మథుల విగ్రహాలను పూలతో అలంకరించి ప్రత్యేకే పూజలు నిర్వహిస్తారు.

ఊరేగింపు... దవడల్లో దబ్బణం గుచ్చుకుని...

ఊరేగింపు... దవడల్లో దబ్బణం గుచ్చుకుని...

సోమవారం ఉదయం 6గంటల నుంచి సాయంత్రం వరకు శస్త్రధారణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనేవారు రెండు దవడల్లో దబ్బణం గుచ్చుకుని ఊరేగింపులో పాల్గొంటారు.చిన్న పిల్లలను అందంగా అలంకరించి విమానం లాంటి వాహనంలో వారిని కూర్చోబెట్టి మేళ,తాళాల నడుమ ఊరేగింపు చేపడుతారు. ఈ సంప్రాదాయాన్ని కొనసాగించడం ద్వారా తమ కుటుంబాలకు మంచి జరుగుతుందని అక్కడివారు విశ్వసిస్తారు. వందేళ్లకు పైగా ఈ ఆచారం కొనసాగుతోందని స్థానిక రతి,మన్మథ ఆలయ పూజారి బసవరాజు తెలిపారు. సృష్టి కి మూల పురుషులు అయిన రతి, మన్మథులను హోలీ రోజు ఊరంతా కొలుస్తారని చెప్పారు.

English summary
It is learned that Holi celebrations have been banned in many states across the country due to corona. In Andhra Pradesh, however, the government has allowed the celebration of Holi following corona rules. With this, the people of the state are celebrating Holi on Sunday (March 28). As usual, locals in Adoni, Kurnool district, continue their special custom and tradition in celebrating Holi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X