ఇండియాలో మగాళ్లకు శృంగారం చేయడం రాదు..మహిళా కోచ్ సంచలన కామెంట్స్(వీడియో)
కాలం మారింది. కాలంతో పాటు మనం కూడా మారాలని తరుచూ వింటూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో ఇది నిజమే అనిపిస్తోంది. గతంలో మన దేశంలో శృంగారం గురించి బహిరంగంగా చర్చించుకోవడానికి చాలా సిగ్గుపడేవారు. కాని ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. మన దేశంలో కూడా సెక్స్ గురించి నేరుగానే చర్చించుకుంటున్నారు. డేటింగ్ , లివింగ్ రిలేషన్ షిప్ వంటి పాశ్చాత్య దేశాల కల్చర్ మనకు కూడా వచ్చేసింది.
అయితే తాజాగా ఓ మహిళ కోచ్ ఇండియాలోని పురుషులు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. లైఫ్ కోచ్ చేతన చక్రవర్తి భారతీయ పురుషుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇండియాలోని పురుషులు గురించి మాట్లాడుతూ..భారతీయ పురుషులతో డేటింగ్ చేయకూడదని ,దానికి గల కారణాలను కూడా ఆమె వివరిస్తూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది.

మొదట కారణం: భారతదేశపు పురుషులు తన ముందున్న మహిళలను గౌరవం లేకుండా పిలుస్తారు
రెండో కారణం: ఒక సమస్య గురించి మహిళ గట్టిగా మాట్లాడేటప్పుడు, వారితో మాట్లాడుకుండా ఇక్కడి మగవారు సెలైంట్‌గా ఉంటారు. ఇదే సమయంలో ఆమెను దూకుడు ఉన్న మహిళగా అభివర్ణిస్తారని ఆమె చెప్పుకొచ్చింది.
మూడో కారణం: ఇక ఇక్కడి వారికి శృంగారం అంటే అర్థం కాదు. శృంగారం అంటే నెలకు ఒక డిన్నర్ డేట్ అని మాత్రమే వారికి తెలుసు. అందుకే నేను భారతీయ కుర్రాళ్లతో డేటింగ్ చేయనని ఆమె చెప్పుకొచ్చింది.
ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ ఇండియన్ అయి ఉండి, మన దేశపు పురుషుల గురించి ఇలాంటి కామెంట్స్ చేస్తావా అంటూ ఆమెపై మండిపడుతున్నారు. మరికొందరు ఆమె మాటలతో ఏకీభవిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications