వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూన్‌ చివరి వరకూ లాక్‌డౌన్‌లు తప్పవా ? రాష్ట్రాలకు కేంద్రం తాజా మార్గదర్శకాలివే

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఏప్రిల్‌ 29న తాము జారీ చేసిన మార్గదర్శకాలను మరికొంతకాలం కొనసాగించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాలకు లేఖలు రాశారు. కరోనా పరిస్ధితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.

ఏప్రిల్ 29న కరోనా సెకండ్ వేవ్‌ దృష్ట్యా తాము జారీ చేసిన మార్గదర్శకాలను జూన్‌ 30 వరకూ కొనసాగించాలని కేంద్రం రాష్టాలను కోరింది. ముఖ్యంగా పది శాతం కంటే పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న చోట్ల, బెడ్ల ఆక్యుపెన్సీ 60 శాతం దాటి ఉన్న చోట్ల కోవిడ్ మార్గదర్శకాల అమలు తప్పనిసరని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న కంటెన్‌మెంట్‌ నిబంధనల కారణంగా చాలా ప్రాంతాల్లో కోవిడ్‌ తగ్గుముఖం పట్టినా ఇంకా పలు చోట్ల కేసులు ఎక్కువగా ఉండటాన్ని కేంద్రం గుర్తు చేసింది.

mha repeats covid guidelines, asks states to retain containment measures till june end

కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా ఇంకా యాక్టివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న విషయాన్ని కేంద్రం తాజా లేఖలో రాష్ట్రాలకు గుర్తు చేసింది. పరిస్ధితి పూర్తిగా అదుపులోకి రావాలంటే కంటెయిన్‌మెంట్‌ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. తప్పనిసరి పరిస్ధితుల్లో ఎక్కడైనా మినహాయింపులు ఇవ్వాల్సి వస్తే పరిస్ధితుల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ఇందు కోసం స్ధానిక పరిస్ధితుల్ని, వైద్యం అందుబాటు వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని దశల వారీగా చర్యలు చేపట్టాలని తెలిపింది.

English summary
The Ministry of Home Affairs (MHA) on Thursday repeated the guidelines (under the Disaster Management Act, 2005) issued on April 29 to implement containment measures in districts where either the test positivity rate has been more than 10% in the past one week or where the bed occupancy is more than 60%.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X