మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ రాజీనామా: కారణం అదేనా?
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్(Microsoft) ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ధృవీకరిస్తూ మైక్రోసాఫ్ట్ శుక్రవారం ఓ ప్రకటన వెలువరించింది. అనంత్ మహేశ్వరి మైక్రోసాఫ్ట్ నుంచి బయటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. భారతదేశంలో సంస్థ వ్యాపారాభివృద్ధికి ఆయన అందించిన సేవలకు ధన్యవాదాలు. ఆయన భవిష్యత్తు ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నాం అని మైక్రోసాఫ్ట్ తన ప్రకటనలో పేర్కొంది.
కాగా, అనంత్ మహేశ్వరి మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించకముందు అనంత్ మహేశ్వరి హనీవెల్ ఇండియా ప్రెసిడెంట్‌గా, మెక్‌కిన్సే అండ్ కంపెనీ ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌గా పనిచేశారు. 2016లో ఆయన మైక్రోసాఫ్ట్‌లో చేరారు. అయితే, సాఫ్ట్‌వేర్ కంపెనీలో అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌ల మధ్య ఉన్న తిరుగుబాటు మధ్య మహేశ్వరి నిష్క్రమణ జరిగినట్లు తెలిసింది.

అనంత్.. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పూర్వ విద్యార్థి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో నైపుణ్యం కలిగి ఉన్నారు. అదనంగా, ఆయన బిట్స్, పిలానీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. ఇంకా, అనంత్ మహేశ్వరి.. అహ్మదాబాద్‌లోని గౌరవనీయమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో తన చదువును అభ్యసించారు.

అనంత్ రాజీనామా నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఇండియా నూతన ప్రెసిడెంట్‌గా పునీత్ చందోక్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఇక మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ డైరెక్టర్ నవ్‌తేజ్ బాల్‌ను సీఓఓగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ఐరీనా ఘోష్‌ను మైక్రోసాఫ్ట్ ఇండియా విభాగం మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు వెల్లడించింది. కాగా, ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శశి శ్రీధరన్‌కు ఉన్నతస్థాయి బాధ్యతులు అప్పగించనున్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications