గాలి కుమార్తె పెళ్లి: పెద్దనోట్ల ఎఫెక్ట్, ఎందుకంటే ?
బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహం ముందుగా అనుకున్నట్లే రంగరంగ వైభంగా జరుగుతున్నది. పెద్ద నోట్లు రద్దు ఎఫెక్ట్ ఈ పెళ్లి మీద పడలేదని వెలుగు చూసింది.
పెళ్లి ఎలా జరుగుతుంది అనే విషయం వెనుక అసలు కథ ఇదే. గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి బుధవారం (నవంబర్ 16)న బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో ఘనంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మాస్టర్ స్టోక్ 8/11 ఎఫెక్ట్ ఈ పెళ్లి మీద పడుతుందని చాల మంది అనుకున్నారు. ఇంత ఘనంగా పెళ్లి చెయ్యడం ఎలా సాధ్యం ? అని పలువురు ఆలోచనలో పడ్డారు.

అయితే అలాంటి అటంకాలు ఏమీ ఎదురుకాలేదు. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎంతమాత్రం ఈ పెళ్లి మీద పడలేదు. అందుకు ఓ కారణం ఉంది. గాలి కుమార్తె పెళ్లి ఏడు నెలల క్రితమే నిశ్చయం అయ్యింది. పెళ్లి ఎలా చెయ్యాలి ? భోజనాలు తదితర వ్యవహారాలు ఎలా చూసుకోవాలి అని అప్పుడే చర్చలు జరిగాయి.
అన్ని ఆలోచించిన తరువాత గాలి జనార్దన్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలల క్రితం బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో పెళ్లి సెట్టింగ్స్ ఎలా వేయ్యాలి, భోజనాలు తదితర వ్యవహారాలు ఎలా చూసుకోవాలి అని ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థతో చర్చించారు.
అప్పుడే గాలి జనార్దన్ రెడ్డి ఆ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఆ పనులు వారికి అప్పగించారు. అయితే పెద్ద నోట్లు రద్దు అయ్యే సమయానికి అన్ని పనులు చకచకా జరిగిపోయాయి.
అయితే అంత భారీ మొత్తం తిరిగి ఇవ్వడానికి ఆ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ సాహసం చెయ్యలేకపోయింది. పెద్దనోట్లు బ్యాంకులో ఎలా మార్చుకోవాలో ఆ పాట్లు ఏవో తామే పడాలని ఆ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ నిర్ణయించింది.
ఆరు నెలల క్రితం ముందుగానే చేసుకున్న ఒప్పందం ప్రకారం తాము అన్ని పనులు పూర్తి చేశామని ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగి ఒకరు ఓ ప్రముఖ దినపత్రికతో చెప్పారు. ఆ ఒప్పందం ప్రకారం ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహం యాథావిధిగా జరుగుతున్నది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications