వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ministers: ఏక్ నాథ్ కలలో కూడా ఊహించలేదు, జేపీ నడ్డాతో షిండే, దేవేంద్రుడి మీటింగ్, అందుకే !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ముంబాయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మంత్రివర్గం ఏర్పాటుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం ఏక్ నాథ్ షిండే శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డాతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. మహారాష్ట్రలో మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలి ?, బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు, శివసేన రెబల్స్ కు ఎన్ని పదవువలు, స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి ? అని ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్ బీజేపీ జాతీయ అధ్యక్షుడితో చర్చలు జరిపారని తెలిసింది. త్వరలోనే మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడ్డాయి.

Actor: పార్క్ లో ప్యాంట్ విప్పేసి ఫేమస్ నటుడు ఏం చేశాడంటే ?, సీసీటీవీల్లో, ఫోక్సో కేసు, ఎందచాట, ఏంది !Actor: పార్క్ లో ప్యాంట్ విప్పేసి ఫేమస్ నటుడు ఏం చేశాడంటే ?, సీసీటీవీల్లో, ఫోక్సో కేసు, ఎందచాట, ఏంది !

 ఏక్ నాథ్ షిండే కలలో కూడా ఊహించలేదు !

ఏక్ నాథ్ షిండే కలలో కూడా ఊహించలేదు !

మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏక్ నాథ్ షిండే ఏ విదంగా కుప్పకూల్చారో కొత్తగా చెప్పనవసరం లేదు. డిప్యూటీ సీఎం పదవి గ్యారెంటీ అంటూ బీజేపీతో చేతులు కలిపిన ఏకేనాథ్ షిండే ఆయన కలలో కూడా ఊహించని విదంగా సీఎం అయిపోయారు. బీజేపీ నాయకులు అన్ని విదాలుగా ఆలోచించి శివసేన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండేని సీఎం చెయ్యడంతో దేశం మొత్తం అశ్చర్యం వ్యక్తం చేసింది.

 బీజేపీ లెక్కలు అప్పుడే వేసుకుంది ?

బీజేపీ లెక్కలు అప్పుడే వేసుకుంది ?

ఏక్ నాథ్ షిండేని సీఎం చేసిన తరువాత ఆయన గ్రూప్ లోని ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలో మీరే డిసైడ్ చేసుకోండి అంటూ బీజేపీ పెద్దలు ఏక్ నాథ్ షిండేకి అప్పట్లోనే సూచించారని తెలిసింది. ఇక మాజీ సీఎం అయిన దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకుని ఆయన వర్గీయులకు కీలక మంత్రి పదవులు ఇప్పించుకోవాలని నిర్ణయించారని తెలిసింది.

 అంతా వాళ్ల చేతుల్లోనే ?

అంతా వాళ్ల చేతుల్లోనే ?

మహారాష్ట్రలో నమ్మకమైన నాయకులకే మంత్రి పదవులు ఇవ్వాలని ఇప్పటికే ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్ నిర్ణయించారని తెలిసింది. మంత్రి పదవులు వస్తాయని ఆశపడుతున్న ఎమ్మెల్యేలకు చివరికి నిమిషంలో మంత్రి పదవులు దక్కకపోతే వారి అసమ్మతికి గురికాకుండా చూసే బాధ్యతలను ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్ కు అప్పగించారని తెలిసింది. మహారాష్ట్ర మంత్రి పదవుల విషయంలో ఇప్పటికే బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలని ఇప్పటికే డిసైడ్ చేశారని తెిసింది.

English summary
Ministers: JP Nadda is holding a meeting with Maharashtra CM Eknath Shinde and DCM Devendra Fadnavis in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X