బాలికపై నలుగురు రేప్, రాజ్‌కోట్‌లో నాలుగేళ్ల బాలికపై..

నిందితులు పదేళ్ల బాలికకు చాక్లెట్ ఆశ చూపించి పిలిచారు. ప్రధాన నిందితుడు పదమూడేళ్లు ఉన్నాడు. మిగతా ముగ్గురు పది నుండి పదమూడేళ్ల వయసువారు. నిందితుల ఫిర్యాదు మేరకు హోస్పేట టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
24 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
అత్యాచారం ఆరోపణలతో 24 ఏళ్ల యువకుడు అరెస్ట్ పదకొండేళ్ల బాలిక పైన అత్యాచారానికి ఒడిగట్టినందుకు 24 ఏళ్ల యువకుడు అరెస్టయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. బాలికను నిందితుడు బిపుల్ తొమ్మిది రోజుల క్రితం ఓ కన్స్ట్రక్షన్ సైట్ వద్దకు తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు. అత్యాచారం అనంతరం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు.
ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పేందుకు ఆమె భయపడింది. ఆ తర్వాత ఆమెకు బ్లీడింగ్ అయింది. తల్లిదండ్రులు ఆమెను వైద్యుడి వద్దకు తీసుకు వెళ్లారు. బాలిక అత్యాచారానికి గురయినట్లు వైద్యులు తల్లిదండ్రులకు తెలిపారు. రెండు మూడు రోజుల వరకు బాధితురాలు నిందితుడి పేరు చెప్పలేదు. ఆ తర్వాత చెప్పడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
రాజ్‌కోట్‌లో మైనర్ నాలుగేళ్ల బాలికను రేప్ చేశాడు
నాలుగేళ్ల చిన్నారిని ఓ మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన రాజ్ కోట్‌లో జరిగింది. నిందితుడు పదిహేనేళ్ల వయస్సువాడు. బాలికకు ఏవో తిండి పదార్థాల ఆశ చూపించి అతను ఆమెను పక్కనున్న ఫీల్డులోకి తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications