అబార్షన్ టాబ్లెట్ ఎఫెక్ట్.. మైనర్ అత్యాచార బాధితురాలికి ఏం జరిగిందంటే ??
మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలిక.. అత్యాచారానికి గురై గర్భం దాల్చింది. అయితే గర్భాన్ని తొలగించడానికి హాస్పిటల్ కి వెళ్లి.. వైద్యుల సూచన మేరకు అబార్షన్ మాత్ర తీసుకున్న మరుసటి రోజు తీవ్ర రక్తస్రావంతో మరణించింది. ఈ దుర్ఘటన సర్వత్రా విషాదం నింపుతోంది.
ఏం జరిగిందంటే..?
యావత్మల్‌కు చెందిన విద్యార్థిని గతేడాది డిసెంబర్ 2024 నుండి 28 ఏళ్ల ట్యూషన్ టీచర్ సందేశ్ గుండేకర్ వద్ద చదువుకోడానికి వెళ్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని గుండేకర్ విద్యార్థినిని మోసగించి అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీని ఫలితంగా ఆమె నాలుగున్నర నెలల గర్భవతిగా మారింది. విద్యార్థిని ఆరోగ్యం క్షీణించడంతో విషయం బయటపడింది. దాంతో భట్కూలి పోలీసులు ట్యూషన్ టీచర్ సందేశ్ గుండేకర్‌పై అత్యాచారం కేసు, అలాగే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

కాగా బాధితురాలిపై సామాజిక అపవాదుల భయంతో ఆమె తండ్రి, కుమార్తెను.. పుసద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యుడు అబార్షన్ మాత్రను ఇచ్చాడు. కానీ మాత్ర తీసుకున్న కొద్ది గంటల్లోనే విద్యార్థినికి తీవ్ర రక్తస్రావం ప్రారంభమైంది. పరిస్థితి విషమించి ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో నాందేడ్‌లోని ఒక పెద్ద ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.
వైద్యుల నిర్లక్ష్యంపై విమర్శలు..
బాలికకు అల్ట్రాసౌండ్ లేదా ఇతర పరీక్షలు చేయకుండానే అబార్షన్ మాత్ర ఇవ్వడంపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) చట్టం ప్రకారం గర్భం ఎక్కువ దశలో ఉంటే అబార్షన్ కోసం ప్రత్యేక పద్ధతులు, వైద్య మద్దతు అవసరం. కానీ ఈ కేసులో వైద్యులు అలా చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటన పట్ల స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓ వైపు పాఠాలు నేర్పాల్సిన గురువు చేతిలోనే దారుణం జరిగితే.. మరోవైపు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలే కోల్పోయిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. సదరు వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు వైద్య రికార్డులు, మాత్రల నమూనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రిపై దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications