Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Miss World 2023: ఈ సారి భారత్‌లో- గోవా వేదిక: 130 దేశాల అందగత్తెలు

న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తాన్నీ కట్టిపడేసే కాంపిటీషన్స్ మిస్ వరల్డ్. ప్రతి సంవత్సరం వేర్వేరు దేశాల్లో ఈ పోటీలు జరుగుతుంటాయి. గత ఏదాది ఈ అందాల పోటీలకు ప్యూర్టోరికో ఆతిథ్యాన్ని ఇచ్చింది. కరేబియన్ ఐలండ్స్‌లోని శాన్‌ జువాన్‌లో నిర్వహించిన మిస్ వరల్డ్ 2022 పోటీల్లో పోలెండ్‌ సుందరి కరోలినా బిలావ్స్కా విజేతగా నిలిచారు. తన దేశానికి రెండోసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందజేశారు.

ఈ సారి మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఇది 71వ ఎడిషన్. ఏ రాష్ట్రంలో వీటిని నిర్వహించాలనేది అధికారికంగా ఖరారు కాలేదు గానీ- గోవా తొలి ప్రాధాన్యతలో నిలిచింది. గోవాలో కట్టుదిట్టమైన భద్రత మధ్య మిస్ వరల్డ్ కాంపిటీషన్స్‌ను ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. ఈ సంవత్సరం నవంబర్/డిసెంబర్‌లల్లో వీటిని షెడ్యూల్ చేశారు.

 Miss World 2023 i

27 సంవత్సరాల తరువాత ఈ అందాల పోటీలకు భారత్ వేదికగా మారబోతోంది. 1996లో మిస్ వరల్డ్ పోటీలను భారత్‌లో నిర్వహించారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీల్లో గ్రీస్‌కు చెందిన ఇరెనా స్క్లీవా అందాల కిరీటాన్ని గెలుచుకున్నారు. తొలి రన్నరప్‌గా కొలంబియా సుందరి కరోలినా అరాంగో, సెకెండ్ రన్నరప్‌గా బ్రెజిల్‌కు చెందిన అనూష్క వలేరియా ప్రాడో నిలిచారు. ఆ పోటీల్లో భారత్.. టాప్ 5 లో నిలిచింది. రాణీ జైరాజ్ నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు.

ఇప్పుడు మళ్లీ ఈ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోండటం ఆసక్తి రేపుతోంది. 71వ ఎడిషన్ పోటీలను నిర్వహించడానికి భారత్‌ను ఎంచుకున్నట్లు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్‌పర్సన్ అండ్ సీఈఓ జూలియా మూర్లే, 2022 విన్నర్ కరోలినా బిలావ్స్కా తెలిపారు. ఇవ్వాళ వారు భారత పర్యటనకు వచ్చారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ఈ ప్రకటన చేశారు.

130 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. మిస్ వరల్డ్ లిమిటెడ్, పీఎంఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తాయని అన్నారు. ఈ కాంపిటీషన్ ద్వారా ఇన్‌క్రెడిబుల్ ఇండియా నినాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనేది తమ ఉద్దేశమని జూలియా తెలిపారు. 71వ మిస్ వరల్డ్ 2023 పోటీలను భారత్‌లో నిర్వహించడానికి కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించినట్లు కరోలినా చెప్పారు.

ఈ కాంపిటీషన్‌పై భారత్‌ తనదైన ముద్రను వేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆరుమంది ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు. రీటా ఫారియా తొలి సారిగా భారత్ తరఫున అందాల కిరీటాన్ని గెలుచుకున్నారు. 1966లో ఆమె ఈ ఘనతను సాధించారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్- 1994, ప్రియాంక చోప్రా-1997, యుక్తాముఖి- 1999, ప్రియాంక చోప్రా-2000, మానుషి ఛిల్లర్- 2017లో మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+