వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదృశ్యమైన టిసిఎస్ టెక్కీ శవమై తేలాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తురైపక్కమ్ నుంచి అదృశ్యమైన 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శవమై తేలాడు. అతని శవం శనివారంనాడు కోవలం, మహాబలిపురం మధ్య గల పొలాల్లో కనిపించింది. అతన్ని హత్య చేశారని భావిస్తున్నారు.

తెర్కుపేట్ గ్రామస్థులు బకింగ్‌హామ్ కెనాల్‌కు ఆనుకుని ఉన్న చిత్తడి భూమిలో అతని శవాన్ని చూసి మహాబలిపురం పోలీసులకు సమాచారం అందించారు. అతని శవాన్ని చెంగల్‌పేట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Crime scene

మృతుడిని వి కార్తికేయన్ (31)గా గుర్తించారు అతను తురైపక్కమ్‌లోని టిసిఎస్‌లో పనిచేస్తున్నాడు. అతను కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతన్ని గుర్తించారు. పాత మహాబలిపురం ఐటి కారిడార్ వైపు ఉంటూ వచ్చిన కార్తికేయన్ నవంబర్ 2వ తేదీన తురైపక్కమ్ పురుషుల పేయింగ్ గెస్ట్ హౌస్‌లోకి మారాడు.

సాయంత్రం వేళ తల్లితో కలిసి అతను గృహప్రవేశం చేయాల్సి ఉండింది. అతని తల్లి పక్కవాళ్లింట్లో ఉంచి అడ్వాన్స్ డబ్బుల కోసమని బయటకు వెళ్లి కార్తికేయన్ తిరిగి రాలేదు. ఏదో వస్తువుతో ముఖాన్ని ధ్వంసం చేసిన ఆనవాళ్లున్నాయి. కన్ను చిట్లిపోయింది.

English summary
A 31-year-old software professional who went missing from Thuraipakkam was found murdered in the wetland between Kovalam and Mahabalipuram, on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X