వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మహత్య చేసుకుంటా: పోలీసుల్ని బెదిరించిన స్టాలిన్, కేసు

తనను అసెంబ్లీ లోపలి నుంచి బయటకు లాగేస్తే ఆత్మహత్య చేసుకుంటానని డీఎంకే చీఫ్, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ శనివారం నాడు శాసన సభలో పోలీసులను బెదిరించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తనను అసెంబ్లీ లోపలి నుంచి బయటకు లాగేస్తే ఆత్మహత్య చేసుకుంటానని డీఎంకే చీఫ్, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ శనివారం నాడు శాసన సభలో పోలీసులను బెదిరించారు.

<strong>శశికళకు జైలుకే పంపిస్తే, పళనిస్వామికి ఖర్చు తగ్గుతుంది: నటుడు</strong>శశికళకు జైలుకే పంపిస్తే, పళనిస్వామికి ఖర్చు తగ్గుతుంది: నటుడు

శనివారం ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం బలనిరూపణ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. సభలో గందరగోళం చెలరేగింది. స్పీకర్ ధనపాల్, ప్రతిపక్ష నేత స్టాలిన్‌ల చొక్కాలు చిరిగిపోయాయి. డిఎంకే సభ్యులు స్పీకర్ చైర్‌లో కూర్చున్నారు. విపక్షాల పైన వేటు వేసి.. మరీ స్పీకర్ ఓటింగ్ నిర్వహించి, పళనిస్వామిని గెలిచినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, స్టాలిన్, మరో 63 మంది డీఎంకే నేతల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీలో రణరంగం, మెరీనా బీచ్ వద్ద అనుమతి లేకుండా దీక్ష నేపథ్యంలో వారి ైపన కేసు నమోదు చేశారు.

బూటు కాళ్లతో తన్నారు

బూటు కాళ్లతో తన్నారు

శాసనసభలో మార్షల్స్‌ తమను బూటు కాళ్లతో తన్నారని, తీవ్రంగా గాయపరిచారని ప్రతిపక్షనేత, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ ఆరోపించారు. శాసనసభ నుంచి గెంటివేతకు గురైన అనంతరం స్టాలిన్‌ సచివాలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. సభలో రహస్య ఓటింగ్‌ విధానం కోసం డీఎంకే డిమాండ్‌ చేసిందన్నారు.

రహస్య ఓటింగ్‌కు పట్టుబట్టినా..

రహస్య ఓటింగ్‌కు పట్టుబట్టినా..

స్పీకర్ అంగీకరించలేదని, దీంతో సభాపతిని ముట్టడించి డీఎంకే సభ్యులు నినాదాలు చేశారని స్టాలిన్ చెప్పారు. దీంతో సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారన్నారు. అనంతరం సభాపతి తమను వారి గదికి పిలిచి మాట్లాడారని, రహస్య ఓటింగ్‌కు సంబంధించి అక్కడ కూడా డిమాండ్‌ చేశామన్నారు.

తెలిసో తెలియకో..

తెలిసో తెలియకో..

అంతకుముందు సభలో తెలిసో, తెలియకో జరిగిన విషయాలపై విచారం వ్యక్తం చేశామని స్టాలిన్ తెలిపారు. మధ్యాహ్నం సభ ఆరంభమైనప్పటికీ ఓటింగ్‌ విధానంలో ఎలాంటి మార్పు జరగలేదన్నారు. దీంతో తాము లోపలే కూర్చొని ఆందోళనకు దిగామన్నారు. అయితే తమను డిప్యూటీ కమిషనర్‌ శేషసాయి ఉత్తర్వుల మేరకు మార్షల్స్‌ బలవంతంగా గెంటి వేయించారన్నారు. ఈ క్రమంలో తమను బూటు కాళ్లతో తన్నారని, గాయపరిచారన్నారు. తమ చొక్కాలను చించివేశారని చెప్పారు.

స్టాలిన్‌పై దాడికి ఖండన

స్టాలిన్‌పై దాడికి ఖండన

స్టాలిన్‌ ఆరోపణ నేపథ్యంలో డీఎంకే వర్గీయులు పెద్దస్థాయిలో రాజ్ భవన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. స్టాలిన్‌పై సభలో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నినాదాలు చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీడియాతో మాట్లాడిన అనంతరం స్టాలిన్‌ నేరుగా రాజ్‌భవన్‌కు వచ్చారు. గవర్నర్‌ విద్యాసాగర రావుతో భేటీ అయ్యారు. శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు.

మెరీనా బీచ్‌లో..

మెరీనా బీచ్‌లో..

రాజ్ భవన్‌ నుంచి బయలుదేరిన స్టాలిన్‌ మెరీనా బీచ్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరాహారదీక్షకు ఉపక్రమించారు. ఈ కార్యక్రమంలో దురై మురుగన్‌, దయానిధి మారన్‌, డీఎంకే ఎమ్మెల్యేలు, ఎమ్పీలు పాల్గొన్నారు. స్టాలిన్‌ దీక్షకు దిగారన్న విషయం తెలియగానే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. చెన్నైలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో డీఎంకే కార్యకర్తలు అక్కడకు తరలి వచ్చారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకు అనుమతి లేదంటూ స్టాలిన్‌ను అరెస్టు చేశారు.

English summary
DMK chief M.K.Stalin on Saturday threaten police that he will commit suicide if they pull him out from the Tamil Nadu Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X