మాతో పెట్టుకుంటే నాలుకలు చీరేస్తాం: ఎంఎల్ఏ

పాట్నా: బీహార్ లో అధికారంలో ఉన్న మంత్రులు, శాసన సభ్యులు రెచ్చి పోతున్నారు. వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను బహిరంగంగానే బెదిరిస్తున్నారు. మా మద్దతుదారుల జోలికి వస్తే మీ నాలుకలు చీరేస్తాం అంటూ బహిరంగ సమావేశాల్లో హెచ్చరిస్తున్నారు.

బీహార్ లోని భగల్బూర్ జిల్లా గోపాల్ పూర్ నియోజక వర్గం శాసన సభ్యుడు (జేడీ =యూ))నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ ఇటీవల నావగాచియా బజార్ ప్రాంతంలో క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మా వాళ్లను, కార్యకర్తలను ఎవరైనా బెదిరిస్తే వారి అంతు చూస్తానని హెచ్చరించారు.

మా వాళ్ల జోలికి వస్తే మీ నాలుకలు చీరేస్తాం అంటూ హెచ్చరించారు. మేము అధికారంలో ఉన్నాం, అసలు మీరేమనుకుంటున్నారు ? మమ్మల్ని బెదిరించే స్థాయికి వచ్చారా, మీరెంత, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండండి అంటూ రెచ్చిపోయారు. నేను గోపాల్ మండల్, తరువాత శాసన సభ్యుడు అని అన్నారు.

MLA threatens to chop off tongue of those threatening his supporters

నా ఒక కాలు బయట ఉంటే మరొ కాలు జైలులో ఉంటుంది, సమాజంలో నాకో స్టేటస్ ఉంటుంది అని గుర్తు చేశారు. అధికారంలో ఉన్న జేడీ (యూ) శాసన సభ్యుడి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. శాసన సభ్యుల శైలి అధికార మహా కూటమి పాలనకు అద్దం పడుతున్నాయని బీజేపీ నాయకుడు నంద కిశోర్ మండిపడ్డారు.

అయితే బీజేపీ నేత నంద కిశోర్ ఆరోపణలపై స్పందించడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిరాకరించారు. గతంలో నంద కిశోర్ కారును నిలిపినందుకు డీఎస్పీ స్థాయి అధికారి మీద ఆయన ( నంద కిశోర్ )దౌర్జన్యం చేశారని ఆరోపణలు ఉన్నాయని పలు పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. శాసన సభ్యుడు నరేంద్ర కుమార్ నీరజ్ ను అధికార పార్టీ నాయకులు వెనుకేసుకుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+